శర్వా ముంబై పర్యటన వెనుక కారణమిదే
సంపత్ నందితో కలిసి శర్వానంద్ తన 38వ సినిమాను చేయబోతున్నాడు. ఈ మూవీ కోసం శర్వా సాలిడ్ మేకోవర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.;

టాలీవుడ్ లో సినిమా సినిమాకీ ఏదొక కొత్తదనాన్ని ట్రై చేస్తూ ఆడియన్స్ ను మెప్పించాలని చూసే హీరోల్లో శర్వానంద్ కూడా ఒకరు. తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ పక్కింటి అబ్బాయి ముద్ర వేసుకున్న శర్వానంద్ చేతిలో పలు ప్రాజెక్టులున్నాయి. ప్రస్తుతం అభిలాష్ రెడ్డి దర్శత్వంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఓ సినిమా చేస్తున్నాడు శర్వానంద్.
దాంతో పాటూ సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నారీ నారీ నడుమ మురారి అనే సినిమాను కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు కాకుండా శర్వానంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం అందరికీ తెలుసు.
సంపత్ నందితో కలిసి శర్వానంద్ తన 38వ సినిమాను చేయబోతున్నాడు. ఈ మూవీ కోసం శర్వా సాలిడ్ మేకోవర్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. సంపత్ నంది తన సినిమాలోని హీరోలను ఎప్పుడూ చాలా కొత్తగా ప్రెజెంట్ చేస్తాడనే విషయం తెలిసిందే. కెరీర్లో ఇంతకు ముందెన్నడూ చూపించని విధంగా ఆయా హీరోలను సంపత్ తన సినిమాల్లో చూపిస్తాడు.
అన్ని సినిమాల్లో లాగానే సంపత్ ఈ సినిమాలో కూడా తన హీరోని కొత్తగా చూపించనున్నాడు. ఈ సినిమా కథ కూడా 1960 నాటి కథ కావడంతో శర్వా ను ఆ లుక్స్ లో చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాని కోసమే శర్వానంద్ ప్రస్తుతం ముంబైలో ఉన్నాడని, అతని లుక్, మేకోవర్ పై ప్రముఖ స్టైలిస్టులు వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
దీని కోసం హకీమ్ ఆలిమ్, రషీద్ పట్టణం లాంటి ప్రముఖుల సాయంతో ప్రస్తుతం శర్వానంద్ సంపత్ నంది మూవీ కోసం మేకోవర్ అవుతున్నాడని, త్వరలోనే వారు ఈ సినిమాకు సరిపోయే లుక్ లో శర్వానంద్ ను రెడీ చేయనున్నారని తెలుస్తోంది. శర్వా38ను కెకె రాధామోహన్ భారీ బడ్జెట్ తో రూపొందించనుండగా, ఉగాది సందర్భంగా రేపు ఈ సినిమా నుంచి ఏదొక అప్డేట్ వచ్చే ఛాన్సుంది.