పిక్‌టాక్‌ : హొయలు పోతున్న స్పై బ్యూటీ

ఆ సినిమా కూడా హిట్‌ కాలేదు. కానీ నటిగా ఐశ్వర్య మీనన్‌ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.;

Update: 2025-03-25 16:40 GMT

 

తమిళ ముద్దుగుమ్మ ఐశ్వర్య మీనన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం పూర్తి అయింది. 'కాదలిల్ సోదప్పువదు యెప్పడి' సినిమాలో ముఖ్య పాత్రలో నటించడం ద్వారా కోలీవుడ్‌లో అడుగు పెట్టిన ఐశ్వర్య మీనన్‌ తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. 2013 నుంచి వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న ఈ అమ్మడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిఖిల్‌ హీరోగా నటించిన 'స్పై' సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో పెద్దగా ఆఫర్లు రాలేదు. స్పై సినిమా సమయంలోనే ఈమెకు 'భజే వాయు వేగం' సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా కూడా హిట్‌ కాలేదు. కానీ నటిగా ఐశ్వర్య మీనన్‌ కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.

సోషల్‌ మీడియా ద్వారా ఈమె షేర్ చేసే అందమైన ఫోటోలతో తమిళ్‌లోనే కాకుండా తెలుగులోనూ మంచి గుర్తింపు, ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఎక్కువ మంది అభిమానులను సొంతం చేసుకుంది. హీరోయిన్‌గా బిజీగా లేకున్నా, స్టార్‌ హీరోలతో సినిమాలు చేసే అవకాశాలు దక్కకున్నా దాదాపుగా 3.3 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. సోషల్‌ మీడియాలో ఈమె స్కిన్‌ షో ఫోటోలతో పాటు రెగ్యులర్‌ క్యూట్‌ పిక్స్‌ను సైతం షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలిచింది.

సిల్వర్‌ కలర్‌ టాప్‌ను ధరించి, బ్లాక్ డ్రెస్‌తో కన్నుల విందు చేసింది. ఆకట్టుకునే ఈ అమ్మడి ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సాధారణంగా స్కిన్‌ షో ఫోటోలు వైరల్‌ అవుతూ ఉంటాయి. కానీ ఈ అమ్మడి ఫోటోలు పెద్దగా స్కిన్‌ షో చేయకుండానే వైరల్‌ అవుతూ ఉంటాయి. ఈ స్పై బ్యూటీ తెలుగులో మరిన్ని సినిమాలు చేయాల్సిన అవసరం ఉందంటూ నెటిజన్స్ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. స్కిన్‌ షో మాత్రమే కాకుండా నటన విషయంలోనూ ఐశ్వర్య మీనన్‌ మంచి మార్కులు దక్కించుకుంది. అయినా లక్ కలిసి రావడం లేదు.

తమిళనాడులోని ఈరోడ్‌లో జన్మించిన ఐశ్వర్య మీనన్ అక్కడే ఉన్న వెల్లలార్ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో ఉన్నత విధ్యను అభ్యసించింది. ఎస్ఆర్‌ఎమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ సైన్స్ అండ్‌ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్‌ను పూర్తి చేసింది. ఎంఎస్ రమేష్ దర్శకత్వం వహించిన సినిమాతో ఐశ్వర్య ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో జోగి ఫేమ్‌ ప్రేమ్‌ సరసన ఐశ్వర్య మీనన్ నటించింది. ఆ సినిమాలో మానసిక వికలాంగురాలిగా నటించడం ద్వారా విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత తమిళ్‌, తెలుగు సినిమాల్లో నటించడం ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఈమె అందంకు తగ్గట్లుగా ఏ భాషలోనూ ఆఫర్లు రాకపోవడం విచారకరం.

Tags:    

Similar News