స్టార్ హీరోయిన్ పై డైరెక్ట‌ర్ అసంతృప్తి

అది స‌మ‌సిపోయే లోపే ఇప్పుడు న‌య‌న్ మ‌రో వివాదంలో చిక్కుకుంది.;

Update: 2025-03-25 23:30 GMT

ఎప్పుడూ ఏదొక విమ‌ర్శ లేదంటే వివాదాల్లో చిక్కుకునే ఉంటుంది స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌. మొన్నామ‌ధ్య ధ‌నుష్ తో గొడ‌వ పెట్టుకున్న న‌య‌న్, రీసెంట్ గా మూకుతి అమ్మ‌న్2 పూజా ఈవెంట్ లో న‌టి మీనాను అవ‌మాన‌ప‌రిచార‌ని న‌య‌న్ ను నెటిజ‌న్లు ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. అది స‌మ‌సిపోయే లోపే ఇప్పుడు న‌య‌న్ మ‌రో వివాదంలో చిక్కుకుంది.

సుంద‌ర్ సి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న మూకుతి అమ్మ‌న్2 సెట్స్ లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కు, న‌య‌న‌తార‌కు మధ్య గొడ‌వైంద‌ని, ఈ విష‌యంలోనే న‌య‌న్, సుంద‌ర్ మ‌ధ్య విబేధాలు త‌లెత్తాయని, దీంతో షూటింగ్ నిలిపివేశార‌ని అంటున్నారు. రీసెంట్ గానే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఎప్పుడూ లేనిది న‌య‌న‌తార ఈ పూజా కార్య‌క్ర‌మంలో కూడా పాల్గొంది.

అయితే షూటింగ్ లో భాగంగా ఒక కాస్ట్యూమ్ విష‌యంలో న‌య‌నతార కు, సినిమాకు ప‌ని చేసే అసిస్టెంట్ డైరెక్ట‌ర్ కు మ‌ధ్య చిన్న గొడ‌వ జ‌రిగింద‌ని, అది న‌చ్చక ఆ ఏడీపై న‌య‌న‌తార ఓ రేంజ్ లో ఫైర్ అయింద‌ని, న‌య‌న్ బిహేవియ‌ర్ కు అసంతృప్తి చెందిన డైరెక్ట‌ర్ సుంద‌ర్ న‌య‌న్ ను హీరోయిన్ గా త‌ప్పించి మ‌రో సీనియ‌ర్ న‌టితో ఈ సినిమాను పూర్తి చేయాల‌ని అనుకున్నాడ‌ట‌.

దీంతో నిర్మాత జోక్యం చేసుకుని న‌య‌న‌తారతో డిస్క‌స్ చేసి ప్రాబ్ల‌మ్ ను సాల్వ్ చేశార‌ని అంటున్నారు. దీంతో మూకుతి అమ్మ‌న్2 షూటింగ్ తిరిగి ప్రారంభ‌మైంద‌ని, ప్ర‌స్తుతం చెన్నైలోని ఓ టెంపుల్ లో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జ‌రుగుతుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమా మూకుతి అమ్మ‌న్ కు సీక్వెల్ గా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే మూకుతి అమ్మ‌న్ సినిమాకు ఆర్జే బాలాజీ డైరెక్ట‌ర్. 2020లో వ‌చ్చిన మూకుతి అమ్మ‌న్ భారీ హిట్ గా నిల‌వ‌డంతో ఇప్పుడు దానికి కొన‌సాగింపును గ్రాండ్ స్కేల్ లో తెర‌కెక్కిస్తున్నారు. బ‌డ్జెట్ పెర‌గ‌డంతో ద‌ర్శక‌త్వ బాధ్య‌త‌లు ఆర్జే బాలాజీ నుంచి సుంద‌ర్ కు వెళ్లాయి. మూకుతి అమ్మ‌న్2లో రెజీనా, దునియా విజ‌య్, ఖుష్బూ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా కోసం న‌య‌న‌తార నెల రోజుల‌కు పైగా ఉప‌వాసం ఉంటున్న‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News