నేష‌న‌ల్ క్రష్ ఆస్తి ఎన్నికోట్లు అంటే?

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా రేంజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది.;

Update: 2025-03-26 11:30 GMT
నేష‌న‌ల్ క్రష్ ఆస్తి ఎన్నికోట్లు అంటే?

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా రేంజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతుంది. `యానిమ‌ల్` ,` పుష్ప‌-2`, `ఛావా` ఇలా వ‌రుస సినిమాల‌తో పాన్ ఇండియాలోనే సంచ‌ల‌నంగా మారిన బ్యూటీ. బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్ ల‌తో అమ్మ‌డి రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. న‌టిగా అన్ని భాష‌ల్లోనూ అవ‌కాశాలు వ‌స్తున్నాయి. కోట్ల రూపాయ‌లు పారితోషికం తీసుకుంటుంది.

రెండేళ్ల త‌ర్వాత చేసే సినిమాకు ఇప్ప‌టి నుంచి అడ్వాన్సులు ఇవ్వ‌డానికి నిర్మాత‌లు క్యూలో ఉన్నారు. సొగ‌స‌రి తో లేడీ ఓరియేంటెడ్ చిత్రాలు తీయ‌డానికి సిద్దంగా ఉన్నారు. ప్రస్తుతం ర‌ష్మిక మాత్రం బాలీవుడ్ కెరీర్ పైనే దృష్టి పెట్టి సినిమాలు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ర‌ష్మిక ఆస్తుల చిట్టా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌ఖ్యాత పోర్బ్స్ నివేదిక బ‌య‌ట‌పెట్టింది. అమ్మ‌డి వ‌య‌సు 28.

కానీ ఆస్తి మాత్రం 66 కోట్ట వ‌ర‌కూ సంపాదించింది. ఒక్కో సినిమాకు 4 నుంచి 8 కోట్ల మ‌ధ్య‌లో పారితోషికం రూపంలో అందుకుం టుంది. అతి త్వ‌ర‌లోనే ఆమె ఆస్తి విలువ 100 కోట్ల‌కు చేరుతుంద‌ని పోర్స్బ్ అంచ‌నా వేస్తోంది. హీరోయిన్ గా న‌టిస్తూనే ర‌ష్మిక బ్రాండ్ అంబాసిడ‌ర్ గాను కొన‌సాగుతుంది. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించే అవ‌కాశం వ‌చ్చిందంటే కాద‌న‌కుండా లాక్ చేస్తుంది.

అది చిన్న‌దైనా...పెద్ద‌తైనా చేయి దాటిపోకుండా డీల్ కుదుర్చుకుని క్లోజ్ చేస్తుంది. `యానిమ‌ల్` విజ‌యం ద‌గ్గ‌ర నుంచి ఈ ర‌క‌మైన స్పీడ్ బాగా పెంచింది. ఫాంలో ఉన్నంత కాలమే దున్నుకోవాలి అన్న చందంగా ర‌ష్మిక బ్రాండింగ్స్ చేస్తుంది. ఇదంతా కేవ‌లం ర‌ష్మిక క‌ష్టార్జితం. న‌టిగా ప్ర‌యాణం మొద‌లైన ద‌గ్గ‌ర నుంచి తాను సంపాదించిందే ఇదంతా. క‌న్న‌డ చిత్రంతో ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News