టాలీవుడ్ నటి డేటింగ్ గుట్టు రట్టు
లక్షలాదిగా జనం షో చూస్తున్న సమయంలో అతడు చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.;
ఆమె, అతడు బిగ్‌బాస్ కంటెస్టెంట్స్.. అతడు బిగ్ బాస్ విజేత కూడా. ఆ ఇద్దరి మధ్యా ఏదో నడుస్తోందని గుసగుసలు వినిపించాయి. అయితే వాటిని ఆ ఇద్దరిలో ఎవరూ ధృవీకరించలేదు. చివరికి ఇప్పుడు ఒక కార్యక్రమంలో అతడు ఓపెనయ్యాడు. ఆమెతో రిలేషన్ లో ఉన్నానని అన్నాడు. లక్షలాదిగా జనం షో చూస్తున్న సమయంలో అతడు చేసిన వ్యాఖ్యలు క్షణాల్లో అంతర్జాలంలో వైరల్ అయ్యాయి.
అలా తెలుగు నటి మన్నారా చోప్రా డేటింగ్ గుట్టు రట్టయింది. అతడు ఎవరో కాదు.. బిగ్ బాస్ ఓటీటీ 2 విజేత ఎల్విష్ యాదవ్. అతడితో సంబంధంలో ఉన్న విషయాన్ని మన్నారా చోప్రా అంగీకరించనూ లేదు.. అలాగని కొట్టి పారేయనూ లేదు. దీంతో ఆల్మోస్ట్ మౌనం అంగీకారమేనని అంతా భావిస్తున్నారు.
మన్నారా చోప్రా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. జక్కన్న, తిక్కా, రోగ్, సీత వంటి తెలుగు చిత్రాలలో నటించింది. ఇప్పుడు యూట్యూబర్, బిగ్ బాస్ OTT 2 విజేత ఎల్విష్ యాదవ్‌తో కలిసి సన్నిహితంగా మెలుగుతోంది. ఈ జంట ఇటీవల 'లాఫ్టర్ చెఫ్స్ 2'లో కనిపించింది. దీంతో డేటింగ్ వ్యవహారం రచ్చకెక్కింది. ప్రస్తుతం పంజాబీ సినిమా ఓహి చాన్ ఓహి రాతన్ చిత్రీకరణలో బిజీగా ఉన్న మన్నారా డేటింగ్ పుకార్లపై స్పందించాల్సి ఉంది.