అక్కడా సత్తా చాటిన సంచలన చిత్రం!
ఉత్తమ డైరెక్టర్ గా పాయల్ కపాడియా నిలిచింది.;

పాయల్ కపాడియా తెరకెక్కించిన 'ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ లైట్' ఇప్పటికే పలు అవార్డు..రివార్డులతో మారుమ్రోగిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక ఫిలిం ఫేర్ అవార్డు...అంతర్జాతీయ వేదికలపైనా మెరిసింది. తాజాగా ఈ సినిమా మరో ఘనత చాటింది. క్రిటిక్ ఛాయిస్ అవార్డును ఖాతాలో వేసుకుంది. ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఉత్తమ చిత్రంగా నిలించింది. ఉత్తమ డైరెక్టర్ గా పాయల్ కపాడియా నిలిచింది.
అలాగే బాలీవుడ్ నటుడు దిల్జిత్ దోసాంజ్ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యాడు. `అమర్ సింగ్ చంమ్కీలా`కు గాను ఈ గుర్తుంపు దక్కింది. ఫిల్మ్ క్రిటిక్స్ గిల్డ్- గ్రూప్ ఎమ్ మోషన్ ఎంటర్ టైన్ మెంట్స్ క్రిటిక్స్ ఛాయిస్ అవార్డు 2025 విజేతలను ప్రకటించారు. ఇందులో భారత్ కు చెందిన పలు ఫీచర్ ఫిల్మ్ లు.. షార్ట్ ఫిల్మ్ లు..డాక్యుమెంటరీలు.. వెబ్ సిరీస్ లు అవార్డులు...రివార్డులు సొంతం చేసుకున్నాయి.
షార్ట్ పిలిం కేటగిరి విజేతలు ఉత్తమ షార్ట్ ఫిలిం ఓబుర్, ఉత్తమ దర్శకుడు ఫరాజ్ అలీ(ఓబుర్), ఉత్తమ నటుడు జల్ తు జలాల్ తూ చిత్రానికి హరీష్ ఖన్నా, ఉత్తమ నటి: తాక్ (ట్రాక్టర్ ) కోసం జ్యోతి డోగ్రా, ఉత్తమ రచన: ఓబుర్ కి ఫరాజ్ అలీ, ఉత్తమ సినిమా టోగ్రఫీ: ఆనంద్ బన్సాల్(ఓబుర్), ఉత్తమ డాక్యుమెంటరీ గా నాక్టర్న్స్ నిలిచింది.
ఉత్తమ వెబ్ సిరీస్ : పోచర్, ఉత్తమ దర్శకుడు: రిచీ మోహతా( పోచర్), ఉత్తమ నటుడు: బరున్ సోబ్తి ( రాత్ జవాన్ హై), ఉత్తమ నటి: నిమిషా సజయన్ (పోచర్), ఉత్తమ సహాయ నటుడు: దిబ్యేందు భట్టాచార్య( పోచర్) నిలిచారు. ఫిల్మ్ ఫీచర్ విభాగంలో ఉత్తమ చిత్ర ఆల్ ఉయ్ ఇమేజిన్ యాజ్ లైట్, ఉత్తమ దర్శకురాలు పాయల్ కపాడియా, ఉత్తమ నటుడు దిల్జి దోసాంజ్, ఉత్తమ నటి: దర్శనా రాజేంద్రన్ నిలిచారు.