భర్తతో బ్రేకప్ తర్వాత నటి స్వేచ్ఛా విహారం
అయితే, గత సంవత్సరం తనకు ఎదురైన మంచి, చెడు అనుభవాలకు కృతజ్ఞురాలిని అని తెలిపింది.;
వివాహ బంధం నుంచి బయటపడ్డాక నటాషా స్టాంకోవిచ్ స్వేచ్ఛా జీవితం మీడియా హెడ్ లైన్స్ లోకొస్తోంది. నటాషా మునుపటి కంటే ఎంతో స్వేచ్ఛగా ఉంది. జీవితాన్ని జాలీగా ఆస్వాధిస్తోందని నెటిజనుల్లో కామెంట్లు వినిపిస్తున్నాయి. భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా నుంచి నటాషా నాలుగు సంవత్సరాల ఆనందకరమైన సంసారం తర్వాత విడిపోయింది. ఈ బ్రేకప్ చాలా ఆశ్చర్యపరిచింది. ఈ జంట జూలై 2024లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఇద్దరూ ఒంటరి జీవితం గడుపుతున్నారు. వారు తమ కుమారుడు అగస్త్యకు సహతల్లిదండ్రులుగా కొనసాగుతున్నారు. ఇటీవలి మీడియా ఇంటర్వ్యూలో నటాషా తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. సవాళ్లతో కూడుకున్నది అని వ్యాఖ్యానించింది. అయితే, గత సంవత్సరం తనకు ఎదురైన మంచి, చెడు అనుభవాలకు కృతజ్ఞురాలిని అని తెలిపింది.
ప్రస్తుతం నటాషా స్వేచ్ఛా జీవనానికి సంబంధించిన వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా నటాషా వరుస బికినీ ఫోటోషూట్లు అగ్గి రాజేస్తున్నాయి. తాజాగా ఈ భామ షేర్ చేసిన బికినీ లుక్ వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది. ఈ బ్యూటీ అందచందాలు, స్వేచ్ఛా జీవనం గురించి అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నటాషా ఇంతకుముందు సెలబ్రిటీ కోచ్ అలెక్స్ ఇలిక్ తో కలిసి జిమ్ చేస్తున్న ఫోటోలు వీడియోలను కూడా షేర్ చేసింది.
గత సంవత్సరం కష్టకాలమే. మంచి చెడు రెండూ ఉన్నాయి. కానీ సవాళ్లను ఎదుర్కొని ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉంది అని నటాషా వ్యాఖ్యానించింది. చాలా అనుభవాలు (మంచి మరియు చెడు) ఉన్నాయి కాబట్టి మనం వయస్సుతో కాకుండా అనుభవాలతో పరిణతి చెందుతామని నేను నమ్ముతున్నాను అని ఫిలాసఫీ మాట్లాడింది. సవాళ్లకు ప్రతిస్పందించే విధానం ఒకరి ఎదుగుదలను నిర్వచిస్తుంది. ఎదురుదెబ్బలను వైఫల్యాలుగా చూడలేము.. కానీ మిమ్మల్ని మంచి వైపు మళ్లించండి. ఎవరినీ తప్పుగా నిరూపించడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే శాంతిని కోల్పోవాల్సి ఉంటుంది! అని నటాషా స్టాంకోవిక్ అభిప్రాయపడ్డారు.