కాజల్ ఈ ఎక్స్ ట్రా డోస్ అందుకేనా..?
అంతేకాదు హీరోయిన్స్ పెళ్లికి ముందు ఎంత రెచ్చిపోయినా కూడా పెళ్లైతే మాత్రం సినిమాలకు బై బై చెప్పడం లేదంటే ఒకటి అరా చేసినా కూడా పద్ధతిగా కనిపించే పాత్రలే చేసే వారు.;

హీరోయిన్స్ కి పెళ్లైతే దాదాపు కెరీర్ క్లోజ్ అయినట్టే అన్నట్టుగా చెప్పుకుంటారు. ఐతే ఒకప్పుడు పరిస్థితి వేరు అసలు పెళ్లైన హీరోయిన్ ని సినిమాల్లో తీసుకోవాలంటేనే మేకర్స్ ఆలోచించే వారు కానీ పెళ్లికి హీరోయిన్ యాక్టింగ్ కి సంబంధం లేదు అని తెలుసుకునే సరికి చాలా టైం పట్టింది. అంతేకాదు హీరోయిన్స్ పెళ్లికి ముందు ఎంత రెచ్చిపోయినా కూడా పెళ్లైతే మాత్రం సినిమాలకు బై బై చెప్పడం లేదంటే ఒకటి అరా చేసినా కూడా పద్ధతిగా కనిపించే పాత్రలే చేసే వారు.
ఐతే కాలం మారింది ఇప్పుడు పెళ్లైన హీరోయిన్స్ కూడా స్టార్ ఛాన్స్ లు అందుకుంటున్నారు. పెళ్లి కాకముందు ఎలా గ్లామర్ షో చేశారో ఆఫ్టర్ మ్యారేజ్ మరింత రెచ్చిపోతున్నారు. దీనికి కారణం సినిమాలు అలవాటైన వాళ్లు ఆఫ్టర్ మ్యారేజ్ మళ్లీ ఏదో కొత్త పని చేయలేరు. అందుకే మళ్లీ సినిమా ప్రయత్నాలు చేస్తారు. ఐతే పెళ్లైనా కూడా కొందరి భామల్లో పెద్దగా మార్పు రాదు. అలాంటి వారికి మళ్లీ వరుస ఛాన్స్ లు వస్తుంటాయి.
ఐతే పెళ్లై ఒక బేబీకి తల్లైన తర్వాత కూడా కొంతమంది భామలు అదరగొట్టేస్తుంటారు. అలాంటి వారిలో కాజల్ అగర్వాల్ ఉంటుంది. ఆచార్య టైం లో పెళ్లి చేసుకున్న అమ్మడు త్వరగానే ఒక బాబుకి జన్మనిచ్చింది. ఐతే పెళ్లైనా తను సినిమాలు చేసేందుకు అభ్యంతరం ఏమి లేదని చెబుతూ వచ్చింది కానీ ఆఫ్టర్ మ్యారేజ్ కాజల్ లో మార్పులు కనిపించాయి. అయినా సరే తన ప్రయత్నాలు తాను చేస్తూ వచ్చింది.
ముఖ్యంగా తెలుగులో భగవంత్ కేసరి, సత్యభామ, ఇండియన్ 2 సినిమాల్లో కాజల్ మెరిసింది. ఐతే ఆ సినిమాలేవి ఆమెకు పెద్దగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో సల్మాన్ సికందర్ లో కాజల్ నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కాజల్ యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా జరిగిన సికందర్ ఈవెంట్ లో కాల జిగేల్ అనిపించే గ్లామర్ షో చేసింది. సౌత్ స్టార్ గా ఉన్నప్పుడు కూడా కాజల్ ఇలా రెచ్చిపోయింది లేదు. కానీ ఎలాగైనా కెరీర్ ని మళ్లీ గాడిన పడేసుకోవాలనే ఆలోచనతో కాజల్ ఇలా చేస్తుందనిపిస్తుంది.
కాజల్ గ్లామర్ షో ఆమె ఫ్యాన్స్ కి ఫుల్ ట్రీట్ ఇచ్చింది. సికందర్ కోసం కాజల్ చేసిన ఈ అటెంప్ట్ ఏదైతే ఉందో అక్కడ ఏమో కానీ కాజల్ ని ఇష్టపడే తెలుగు ఫ్యాన్స్ ని అలరించింది. అమ్మడికి తెలుగులో మంచి సినిమాలు పడితే మళ్లీ మునుపటి ఫాం ని కొనసాగిస్తుందని కాజల్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.