తమిళ బాక్సాఫీస్ షేక్ ఆడించే సినిమా అట..!
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమిళ్ లో కూడా వరుస సినిమాలు చేస్తున్నారు.;

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ తమిళ్ లో కూడా వరుస సినిమాలు చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్ అజిత్ తో మైత్రి మూవీ మేకర్స్ చేస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ. ఆధిక్ రవిచంద్రన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలతో తల అజిత్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై నిర్మాత రవి శంకర్ క్రేజీ కామెంట్స్ చేశారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా తమిళ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ తెస్తుందని అన్నారు రవి శంకర్. తమిళ పరిశ్రమలో ఇప్పటివరకు వచ్చిన ఓపెనింగ్ రికార్డులను గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను సృష్టిస్తుందని అన్నారు. అజిత్ సినిమాలన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మేకింగ్ తో ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తాయి.
గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా తల ఫ్యాన్స్ కి మరోసారి ఐ ఫీస్ట్ గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అజిత్ మాస్ స్టామినాని పర్ఫెక్ట్ గా వాడుకుని ఈ సినిమా తీశారని టాక్. సినిమాను ఏప్రిల్ 10న భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఏప్రిల్ 3వ తారీఖు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా ట్రైలర్ రాబోతుంది.
ఈ సినిమాను తెలుగులో కూడా భారీ రిలీజ్ చేసేలా మైత్రి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అజిత్ కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను తెలుగులో కూడా భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అసలైతే అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.
అజిత్ కూడా ఈ సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ గా ఉన్నాడని తెలుస్తుంది. ఫ్యాన్స్ కి ఇది మంచి ఫీస్ట్ అందించేలా ఉంటుందని తెలియడంతో అందరు సినిమా ఎప్పుడెప్పుడు చూసేయాలి అన్నంత ఉత్సాహంతో ఉన్నారు. అజిత్ ఫ్యాన్స్ మాత్రం కూడా ఈ సినిమాతో నెవర్ బిఫోర్ రికార్డులు అందించాలని సిద్ధంగా ఉన్నారు. ఎలాగు సినిమా మాస్ స్టఫ్ అంటున్నారు కాబట్టి ఇదివరకు ఎప్పుడు చూడని సెలబ్రేషన్స్ జరిపేలా అజిత్ ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. సో ఇదే ఊపులో సినిమా ఫస్ట్ షో టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం నిర్మాతలు చెప్పినట్టుగా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ నెంబర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది.