పిక్ టాక్: సితార అచ్చ తెలుగు అందం
ఇదిలా ఉంటే తాజాగా సితార ఉగాది సందర్భంగా తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో సితార ఎంతో అందంగా కనిపించింది.;

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎంతో మంచి క్రేజ్, ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా మహేష్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. మహేష్ ఫ్యామిలీకి ఇచ్చే ప్రియారిటీ చూస్తే ముచ్చటేస్తుంది. మహేష్ తర్వాత అతని ఫ్యామిలీలో అంత క్రేజ్ ఉంది ఎవరికంటే అతని కూతురు సితారకే.

మహేష్ బాబు కూతురుగా సితార ఘట్టమనేని అందరికీ సుపరిచితురాలే. తండ్రితో పాటూ వెకేషన్స్ కు వెళ్తూ కనిపించే సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన ఫోటోలను, అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో తన ఫాలోయింగ్ చూసి సితారను ఓ జ్యూయలరీ షాపు వారు బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకుని ఒక యాడ్ ను కూడా చేశారు.

తన ఫస్ట్ యాడ్ కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ను అందుకున్న సితార దాన్ని తండ్రి మార్గంలోనే సేవా కార్యక్రమాల కోసం వాడి అందరి మనసుల్ని గెలుచుకుంది. ఇదిలా ఉంటే తాజాగా సితార ఉగాది సందర్భంగా తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోల్లో సితార ఎంతో అందంగా కనిపించింది.

తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని సితార లంగా ఓణీలో మరింత అందంగా మెరిసింది. బేబీ పింక్ కలర్ ఓణీ, లెమన్ ఎల్లో లెహంగా ధరించి దానికి తగ్గ జ్యుయలరీ వేసుకున్న సితార అచ్చతెలుగు అమ్మాయిలా చూడముచ్చటగా ఉంది. ఈ ఫోటల్లో చాలా క్యూట్ గా ఉన్నావ్ సితార పాప అంటూ మహేష్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ వాటిని షేర్ చేస్తున్నారు.