స్పిరిట్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి
తాజాగా ఈ మూవీ గురించి సందీప్ రెడ్డి వంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు.;

అర్జున్ రెడ్డి సినిమాతో చిత్ర పరిశ్రమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే సంచలనం సృష్టించాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా ఆ సినిమాను బ్లాక్ బస్టర్ చేశాడు. కబీర్ సింగ్ తర్వాత రణ్‌బీర్ సింగ్ తో యానిమల్ సినిమా చేసి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు సందీప్.
యానిమల్ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న సందీప్ రెడ్డి వంగా తన తర్వాతి సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేయనున్న విషయం తెలిసిందే. స్పిరిట్ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలుండగా, తాజాగా ఈ మూవీ గురించి సందీప్ రెడ్డి వంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు.
ఉగాది సందర్భంగా అమెరికాలో జరిగిన ఓ ఈవెంట్ లో పాల్గొన్న సందీప్ ను ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ గురించి అడగ్గా, దానికి సందీప్ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ప్రస్తుతం తాను స్పిరిట్ సినిమా కోసం మెక్సికోలో లొకేషన్లను వెతుకుతున్నానని, తాను ఆ పని మీదే ఉన్నానని చెప్పాడు. ప్రభాస్ సినిమా కోసం లొకేషన్లు వెతుకుతున్నానని సందీప్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.

స్పిరిట్ కోసం సరికొత్త వాతావరణాన్ని సృష్టించడానికే సందీప్ రెడ్డి మెక్సికోలో లొకేషన్స్ ను వెతుకుతున్నాడని, సినిమాలో కొంత భాగాన్ని అక్కడ షూట్ చేసి సినిమాకు నెక్ట్స్ లెవెల్ హైప్ తీసుకొచ్చే విధంగా సందీప్ ట్రై చేస్తున్నాడని ప్రభాస్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మొత్తానికి సందీప్ స్పిరిట్ కోసం ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది.