విశ్వంభరలో మెగాస్టార్ గాయకుడిగా!
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో సోషియా ఫాంటసీ థ్రిల్లర్ `విశ్వంభర` తెర కెక్కుతోన్న సంగతి తెలిసిందే.;

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ట దర్శకత్వంలో సోషియా ఫాంటసీ థ్రిల్లర్ `విశ్వంభర` తెర కెక్కుతోన్న సంగతి తెలిసిందే. రెండు పాటల చిత్రీకరణ మినహా షూటింగ్ అంతా పూర్తయింది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. సోషియా ఫాంటసీ చిత్రం కావడంతో సీజీ వర్క్ కూడా ఎక్కువగానే ఉంది. దీంతో హాంకాంగ్ సహా హైదరాబాద్ లోనూ ఆ పనులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం లీకైంది. ఈ సినిమా కోసం చిరంజీవి గాయకుడిగా మారబో తున్నారుట. ఆయన ఓ పాట పాడుతున్నారుట. సంగీత దర్శకుడు కీరవాణి ఆ పాటకు చిరంజీవి వాయిస్ అయితే బాగుంటుందని భావించి పాడలని కోరారుట. చిరంజీవి తొలుత తన వల్ల కాదు అన్ని కీరవాణి పట్టుబట్టడంతో అంగీకరిచినట్లు సన్నిహితుల సమాచారం.
మరి చిరంజీవి పాడబోయే ఆ పాట సంగతేంటో అధికారికంగ ప్రకటిస్తే గానీ క్లారిటీ రాదు. చిరంజీవి కి పాటలు పాడటం కొత్తేం కాదు. ఇప్పటికే కొన్ని సినిమాల్లో అవసరం గాయకుడిగా గొంతు సవరించారు అయితే అది జరిగి చాలా కాలమవుతోంది. `చూడాలని వుంది`, `మృగరాజు`,` మాస్టర్` లాంటి చిత్రాల్లో పాటలు పాడారు. ఆ తర్వాత మళ్లీ అలాంటి ఛాన్స్ తీసుకోలేదు. మద్యలో రాజకీయాల్లోకి వెళ్లడంతో సినిమాలకు గ్యాప్ ఏర్పడింది.
కంబ్యాక్ తర్వాత మరే సినిమాలోనూ పాడే అవకాశం రాలేదు. మళ్లీ ఇంత కాలనికి కీరవాణి చొరవ తీసు కోవడంతో గాయకుడిగా మారుతున్నారు. మెగాస్టార్ కూడా మునుపటి కంటే మరింత యాక్టివ్ గా ఉంటున్నారిప్పుడు. ఏ కార్యక్రమాలంలోనైనా చలాకీగా పాల్గొంటున్నారు. అవసరం మేర రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. మరి నవతరం గాయకుడిగా ఎలా మెప్పిస్తారో చూడాలి.