వారి కంటే రజనీకాంత్ చాలా బెటర్!
రజనీకాంత్ సింప్లిసిటీ గురించి బాలీవుడ్ స్టార్ నటుడు ముఖేష్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.;

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ సింప్లిసిటీ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. సూపర్ స్టార్‌గా వరుస సినిమాలు చేస్తూ ఉండే రజనీకాంత్ రియల్ లైఫ్ లో చాలా సింపుల్‌గా ఉంటారు. ఆయన ఎక్కడకు వెళ్ళినా హంగామా లేకుండానే వెళ్తారు. ముఖ్యంగా రజనీకాంత్ సినిమాలో తప్ప ఎప్పుడూ బయటకు వెళ్లినప్పుడు విగ్ ను పెట్టుకుని కనిపించలేదు. అంతే కాకుండా ఆయన కెమెరా ముందు మాత్రమే మేకప్‌తో కనిపిస్తారు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా మేకప్‌తో కనిపించరు. ఏ కార్యక్రమంలో కనిపించినా ఆయన బట్ట తలతోనే మనం చూస్తూ ఉంటాం. అంతే కాకుండా ఆయన్ను ఎక్కువగా మేకప్ లేకుండానే చూస్తూ ఉంటాం.
రజనీకాంత్ సింప్లిసిటీ గురించి బాలీవుడ్ స్టార్ నటుడు ముఖేష్ ఖన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్స్‌తో పోల్చుతూ ఆయన రజనీకాంత్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఒకప్పుడు బుల్లి తెరపై, ఆ తర్వాత వెండి తెరపై తనదైన సత్తా చాటిన ముఖేష్ ఖన్నా శక్తిమాన్ గా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ఒకప్పుడు శక్తిమాన్ అంటూ పిలిపించుకున్న ముఖేష్ ఖన్నా మధ్యలో కొన్నాళ్లు కనిపించకుండా పోయారు. కానీ ఈ మధ్య ఈయన తెగ వార్తల్లో నిలుస్తున్నారు. ఈమధ్య కాలంలో బాలీవుడ్‌లో వచ్చిన మార్పులపై ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ముఖేష్ ఖన్నా మాట్లాడుతూ... బాలీవుడ్‌లో ఎంతో మంది స్టార్స్ ఉన్నప్పటికీ వారందరి కన్నా రజనీకాంత్ చాలా బెటర్. ఇతర స్టార్స్ మాదిరిగా కాకుండా రజనీకాంత్ ఎప్పుడూ తన అభిమానులతో సన్నిహితంగా ఉంటారు. అంతే కాకుండా అభిమానులతో చాలా స్వచ్ఛంగా ఆయన ఉంటారు. ఎప్పుడూ మేకప్, విగ్ లేకుండానే కార్యక్రమాల్లో పాల్గొంటారు. తన స్టార్‌డంను పట్టించుకోకుండా బయటి ప్రపంచంలో ఉంటారు. ఆయన గొప్ప వ్యక్తి అంటూ ముఖేష్ ఖన్నా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేశ వ్యాప్తంగా రజనీకాంత్‌కి అభిమానులు ఉంటారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే కెరీర్ ఖతం అనుకుంటున్న సమయంలో జైలర్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో మళ్లీ పుంజుకున్నారు. రికార్డ్ బ్రేకింగ్ వసూళ్లు సాధిస్తున్న రజనీకాంత్ ఈ ఏడాదిలో కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న కూలీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్స్ జరుపుకుంటోంది. సమ్మర్ చివర్లో ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్. చిత్ర యూనిట్ సభ్యులు త్వరలో సినిమా విడుదల తేదీపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో 'జైలర్ 2' సినిమాను మొదలు పెట్టాడు. వచ్చే ఏడాదిలో జైలర్ 2 తో రజనీకాంత్ రాబోతున్నారు. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు సైతం రజనీకాంత్ చేయబోతున్నారు. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. త్వరలో వాటి ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.