దేవర2పై ఇంట్రెస్ట్‌ను పెంచిన ఎన్టీఆర్
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు దేవర2కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది.;

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా దేవర1. గతేడాది సెప్టెంబరులో రిలీజైన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కూడా దేవర మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ఈ సినిమా జపాన్ లో రిలీజైన విషయం తెలిసిందే. దేవర జపాన్ లో రిలీజవుతున్న సందర్భంగా హీరో ఎన్టీఆర్, కొరటాల శివ జపాన్ వెళ్లి దేవర ప్రమోషన్స్ లో పాల్గొన్నారు.
సినిమా ప్రీమియర్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ అక్కడి మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ కు దేవర2కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దేవర చాలా పెద్ద కథ అని, దేవర1 అందులో సగం మాత్రమేనని, నెక్ట్స్ పార్ట్ చాలా అద్భుతంగా ఉండబోతుందని ఎన్టీఆర్ చెప్పాడు. దేవర1లో అందరూ దేవర గురించి చాలా తెలుసుకున్నారు.
కానీ ఈసారి వర తో పాటూ దేవరకు అసలు ఏం జరిగిందో తెలుసుకుంటారని చెప్పాడు ఎన్టీఆర్. ఆల్రెడీ దేవర2 కు సంబంధించిన స్క్రిప్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిందని, 2026 ఫస్టాఫ్ లో దేవర2 సెట్స్ పైకి వెళ్లనుందని ఎన్టీఆర్ తెలిపాడు. అంటే ఈ లోపు ఎన్టీఆర్ తను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాల్సి ఉందన్నమాట.
యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమా చాలా గొప్ప మూవీ అవుతుందనే నమ్మకముందని ఎన్టీఆర్ చెప్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనున్న ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ తో పాటూ బాబీ డియోల్ కూడా విలన్ పాత్ర చేయనున్నాడని అంటున్నారు. దేవర2కు కూడా అనిరుధ్ సంగీతం అందిస్తాడు.
ఇప్పటికే హృతిక్ రోషన్ తో కలిసి వార్2 చేసిన ఎన్టీఆర్, ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ నీల్ సినిమా ఆల్రెడీ సెట్స్ పైకి వెళ్లి షూటింగ్ జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి నీల్- ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కానుండగా, ఈ ఇయర్ నవంబర్ ఎండింగ్ కు షూటింగ్ పూర్తి చేసి సినిమా రిలీజయ్యాక దేవర2 ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు ఎన్టీఆర్.