దేవియానీ.. మినీ స్కర్ట్ లో బ్లాస్టింగ్

లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ గ్లామర్ స్టిల్స్ ఫ్యాషన్ లవర్స్‌ను కట్టిపడేస్తున్నాయి.;

Update: 2025-04-07 14:30 GMT
Deviyani Sharma Stuns In Black And White

తనదైన నటనతో పాటు మోడలింగ్‌లో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్న దేవియానీ శర్మ మరోసారి హైలెట్ అవుతోంది. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఈ ముంబై బ్యూటీ, తర్వాత వెబ్ సిరీస్‌ల వైపు అడుగులు వేసి అక్కడే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 'అనగనగా', 'సైతాన్', 'సేవ్ ద టైగర్స్' వంటి ప్రాజెక్ట్స్‌లో ఆమె కనిపించిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. లేటెస్ట్ గా ఆమె షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ గ్లామర్ స్టిల్స్ ఫ్యాషన్ లవర్స్‌ను కట్టిపడేస్తున్నాయి.


ఈ ఫొటోల్లో దేవియానీ పొట్టి మినీ స్కర్ట్, ఫుల్ స్లీవ్ టాప్ ధరించి క్యాజువల్ గ్లామర్‌లో మెరిసిపోతోంది. అతి సహజమైన హావభావాలతో ఆమె ఇచ్చిన పొజ్‌లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఆమె బాడీ లాంగ్వేజ్, ఆత్మవిశ్వాసం ఈ ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. “అందంగా కనిపించండి” అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ స్టిల్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అభిమానులు ‘బ్యూటీ అండ్ డాషింగ్’ అనే కామెంట్లతో సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు.


ఫ్యాషన్‌ పరంగా ఏదైనా కొత్తగా ట్రై చేయడంలో దేవియానీ ఎప్పుడూ ముందుంటుంది. మినీ స్కర్ట్‌ల నుంచి డిజైనర్ వేర్ వరకూ ఆమె ఫోటోషూట్లను ప్రత్యేకంగా ఫాలో అవుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇటీవలి కాలంలో ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, ప్రతి ఫోటోకు స్పెషల్ కాన్సెప్ట్‌ ఉండడం గమనార్హం.

వెబ్‌సిరీస్‌లు చేసి పేరు తెచ్చుకున్న దేవియాని త్వరలోనే సినిమాల్లో కూడా పెద్ద బ్రేక్ కొట్టే ఛాన్స్ ఉందని ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఫీచర్ ఫిల్మ్ లైనప్‌ను సిద్ధం చేసుకుంటుండటంతో ఆమె కెరీర్ కొత్త దశలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ తరహా ఫొటోషూట్స్‌తో తనలోని ఫ్యాషన్ ఐకాన్ కోణాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తోంది దేవియాని. అందం, స్టైల్, కాన్ఫిడెన్స్‌ మిక్స్ చేసిన ఈ లుక్ ఆమెను మరోసారి ట్రెండింగ్‌లోకి తీసుకువచ్చింది.

Tags:    

Similar News