ప్రభాస్ తో మళ్లీ బాలీవుడ్ బ్యూటీ.. సో లక్కీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓవైపు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ ను.. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంప్లీట్ చేస్తున్నారు.;

Update: 2025-04-02 08:33 GMT
ప్రభాస్ తో మళ్లీ బాలీవుడ్ బ్యూటీ.. సో లక్కీ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఓవైపు మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ ను.. మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామా కంప్లీట్ చేస్తున్నారు. త్వరలోనే ఆ రెండు సినిమాలతో థియేటర్లలో సందడి చేయనున్నారు మన డార్లింగ్.

అయితే హను రాఘవపూడి మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వరుస షెడ్యూళ్లతో మేకర్స్ చిత్రీకరణను త్వరగా పూర్తి చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఆ సినిమాలో హీరోయిన్ గా కొత్త అందం ఇమాన్వీని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన ఆమె.. ప్రభాస్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది.

ఇప్పుడు ఆ మూవీలో మరో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా దిశా పటానీని మేకర్స్ సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఆమెతో చర్చలు కూడా జరిగినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆమెను ఇప్పటికే ఫిక్స్ చేశారని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

అయితే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. అదే సమయంలో దిశా పటానీ ఓకే చెబితే.. ఆమె మరోసారి ప్రభాస్ తో జత కట్టినట్లు అవుద్దన్న విషయం తెలిసిందే. ఇప్పటికే కల్కి మూవీలో ప్రభాస్, దిశా పటానీ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇప్పుడు హను రాఘవపూడి మూవీలో మళ్లీ జోడీగా నటించనున్నట్లు సమాచారం.

ఆ సినిమా తర్వాత కల్కి 2898 ఏడీ సీక్వెల్ లో కూడా ప్రభాస్, దిశా పటానీ జోడీగా సందడి చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అందుకు దిశా ఓకే చెప్పేసిందని టాక్ వినిపిస్తోంది. త్వరలో స్టార్ట్ కానున్న షూటింగ్ లో కూడా పాల్గొనుందని తెలుస్తోంది. అలా టాలీవుడ్ లో అమ్మడు బిజీ కానుందన్నమాట.

దిశా విషయానికొస్తే.. మోడలింగ్ ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ.. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని లైమ్ లైట్ లోకి వచ్చింది. ఆ తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లోఫర్ సినిమాతో టాలీవుడ్ హీరోయిన్ గా పరిచయమైంది. కానీ ఈ సినిమా ప్లాప్ కావడంతో బాలీవుడ్ కు షిఫ్ట్ అయిన బ్యూటీ.. కల్కి మూవీతో మళ్లీ అడుగు పెట్టింది. ఇప్పుడు ఇక్కడ మంచి అవకాశాలు అందుకుంటోంది!

Tags:    

Similar News