మొత్తానికి పూరి-సేతుపతి-చార్మీ త్రయం సెట్టయిందిలా!
తాజాగా ఆ కాంబినేషన్ పై ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. కొద్ది సేపటి క్రితమే ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.;

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా డ్యాషింగ్ డై రెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుందని కొన్నిరోజులు గా ప్రచారం జరుగుతోన్న సంగతి తెలిసిందే. వరుస ప్లాప్ ల్లో ఉన్న పూరికి మక్కల్ సెల్వన్ అవకాశం ఇవ్వండి ఏంటి? అని ఎన్నో సందేహాలు కూడా ఉన్నాయి. కానీ ఓ డిఫరెంట్ స్టోరీతో అప్రోచ్ అవ్వడంతో కాంబినేషన్ సెట్ అయిందని గట్టిగానే వినిపించింది.

తాజాగా ఆ కాంబినేషన్ పై ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. కొద్ది సేపటి క్రితమే ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. విజయ్ సేతుపతి, పూరి, ఛార్మి కలిసి దిగిన ఓ ఫోటో పూరి కనెక్స్ట్ నుంచి వచ్చేసింది. పూరి , ఛార్మీ మద్యలో సేతుపతి దిగిన ఫోటోను చూడొచ్చు. అంతా అనుకున్నట్లే ఇది పూరి మార్క్ కి భిన్నంగా ఉండే డిఫరెంట్ స్క్రిప్ట్ అని వినిపిస్తుంది.
దీంతో ఇప్పుడా స్టోరీ ఎలా ఉండబోతుంది? పూరి ఎలాంటి స్క్రిప్ట్ రాసాడు? అన్న చర్చ ఫిలిం సర్కిల్స్ లో మొదలైంది. విజయ్ సేతుపతిని స్టోరీ తో మెప్పించడం అంటే సులభం కాదు. ఆయన హీరోగా సినిమాలు తక్కువగా చేయడానకి కారణం కూడా నచ్చిన కథలకు దొరకక పోవడమే. అందుకే నచ్చి న పాత్రలు వస్తే విలన్ రోల్ అని కూడా చూడకుండా కమిట్ అవుతున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో? కొన్నాళ్ల పాటు విలన్ పాత్రలు పోషించనని ఓ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
తన పై నెగిటివిటీ ఎక్కువ అవుతుందని ...హీరో ఇమేజ్ కోల్పోతున్నాను అనే బెంగను వ్యక్తం చేసాడు. ఈ నేపథ్యంలో విలన్ పాత్రలకు స్వస్తి పలికాడు. దీంతో పూరి సేతుపతి కోసం ఎలాంటి ఎగ్జైట్ మెంట్ స్క్రిప్ట్ సిద్దం చేసాడు? అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియాలో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. పూరి స్వీయా దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఛార్మి యధావిధిగా సహ నిర్మాతగా కొనసాగుతున్నారు.