మల్లె చెండు ఒళ్లంతా చుట్టుకుని కలకలం రేపిన నటి
అందుకే రాగిణి ద్వివేది ఉగాది స్పెషల్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది.;

కొత్తొక వింత పాతొక రోత! పాత సంవత్సరానికి భాయ్ చెప్పి కొత్త సంవత్సరానికి వెల్ కం చెప్పింది కన్నడ నటి రాగిణి ద్వివేది. ఉగాది ఫర్వదినాన్ని పురష్కరించుకుని ఇదిగో ఇలా కొత్తగా కొంగొత్తగా తనని తాను పరిచయం చేసుకుంది. గతాన్ని తలుచుకుని సమయాన్ని వృధా చేసేందుకు రాగిణి సిద్ధంగా లేదు. భవిష్యత్ గురించి మాత్రమే ఆలోచిస్తోంది.

అందుకే రాగిణి ద్వివేది ఉగాది స్పెషల్ ఫోటోషూట్ తో అభిమానుల ముందుకు వచ్చింది. ఇదిగో ఇలా మల్లె చెండును ఒంటికి చుట్టుకుని, జెరీ అంచు బంగారు వర్ణం సిల్కు చీరలో దేవతా సుందరిలా మెరిసిపోతోంది. అలా పానుపుపై జేరబడి, మల్లెలను ముంజేతికి కట్టుకుని సువాసన పీలుస్తూ, అసలు రాగిణి ఇచ్చిన ఫోజ్‌లు కుర్రకారులో కలకలం రేపుతున్నాయి. పానుపుపై బంతిపూల దండల మధ్య రాగిణి రసరమ్యంగా మెరిసిపోతోంది.

ఒక కొత్త సంవత్సరం, ఒక కొత్త అధ్యాయం - దానిని ఆశ - దృఢ సంకల్పంతో స్వీకరించండి! ప్రతి సూర్యోదయం ఒక కొత్త అవకాశాన్ని తెస్తుంది - దీనిని అద్భుత ప్రారంభంగా చేసుకోండి! పండుగ రంగులు మీ జీవితాన్ని ఆనందం, శ్రేయస్సు విజయంతో చిత్రించాలి. కొత్త సీజన్ వికసించినప్పుడు, ఈ పండుగలో మీ కలలు వాస్తవంలోకి వికసించాలి.. అనే అందమైన క్యాప్షన్ ని ఈ ఫోటోలకు జోడించింది.
రాగిణి ద్వివేది కన్నడ నాట అగ్ర కథానాయిక. స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ పేరు ఇంతకుముందు డ్రగ్స్ స్కాండల్ లో వినిపించింది. కొద్దిరోజుల పాటు జైలు జీవితాన్ని కూడా అనుభవించి బయటకు వచ్చింది. ఇటీవల తిరిగి తన కెరీర్ పై నే ఫోకస్ చేసింది. జీవితంపై పాజిటివ్ ధృక్పథం కలిగి ఉన్న రాగిణికి మునుముందు నటిగా మంచి అవకాశాలు దక్కాలని ఆకాంక్షిద్దాం. రాగిణికి ఉగాది శుభాకాంక్షలు.