జాన్వీ, అనన్యపై కన్నేసిన 60 ఏజ్ హీరో?
షష్ఠిపూర్తికి ఇంకొన్ని రోజులే మిగిలి ఉంది. 60 వయసు హీరో తన వయసులో సగం కంటే తక్కువ (28 ఏళ్ల) వయసున్న హీరోయిన్ తో నటించాడు.;

షష్ఠిపూర్తికి ఇంకొన్ని రోజులే మిగిలి ఉంది. 60 వయసు హీరో తన వయసులో సగం కంటే తక్కువ (28 ఏళ్ల) వయసున్న హీరోయిన్ తో నటించాడు. అది సరిపోదు అన్నట్టు జాన్వీ, ఖుషీ, అనన్య లాంటి యంగ్ అమ్మాయిలతోను నటించాలనుకుంటున్నాడట. ఇది విచిత్రమే అయినా కానీ, అందుకు ఏమాత్రం అవకాశం లేనందుకు చాలా బాధపడిపోతున్నాడు పాపం.
ఇంతకీ ఎవరా హీరో? అంటే .. ది గ్రేట్ సల్మాన్ భాయ్. అతడు మరికొద్ది రోజుల్లోనే షష్ఠిపూర్తి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. అమీర్ ఖాన్ 60వ పుట్టినరోజు జరుపుకోగా, ఖాన్‌ల త్రయంలో షారూఖ్, సల్మాన్ కూడా 60వ పుట్టినరోజు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు. అయినా ఇంకా టీనేజీ అమ్మాయిలతో ఛాన్స్ వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. జనం ఏం అనుకుంటారోననే సందేహం కారణంగా వీళ్లు ఎవరూ టీనేజీ హీరోయిన్లతో నటించడం లేదట.
ఇప్పుడు ఇదే విషయాన్ని పబ్లిక్ వేదికపై ధృవీకరించాడు సల్మాన్ భాయ్. సికందర్ ప్రచారంలో మాట్లాడుతూ... అనన్య పాండే, జాన్వీ కపూర్‌లతో కలిసి పనిచేయాలనుకుంటున్నా కానీ.. వయస్సు అంతరం కారణంగా ప్రజలు తనను తిడతారని భయపడుతున్నానని భాయ్ అన్నాడు. వయసు అంతరం గురించి మాట్లాడుతూ తనను యంగ్ బ్యూటీస్ కి దూరం చేసారని కూడా ఆవేదన చెందాడు. వారితో కలిసి నటిస్తే అది మంచి అవకాశం అని భావిస్తాను కానీ! అంటూ నసిగాడు. నేను ఎవరితో అయినా కలిసి పని చేస్తూనే ఉంటాను! అని సల్మాన్ అన్నాడు.
అదే సంభాషణలో, ఒకప్పుడు తాను ఒక నిర్మాతకు చిన్నా పెద్దా తారాగణంతో కలిసి ఏదైనా చేయాలని సూచించానని, కానీ ప్రస్తుత తరం నటులందరూ ఒకరితో ఒకరు కలిసి పనిచేయడానికి నిరాకరించారని కూడా ఆయన వెల్లడించారు. నేటితరంతో కలిసి నటించేందుకు తాము సిద్ధంగా ఉన్నా కానీ, వారు కలిసి రావడం లేదని, 100-200 రోజులు కలిసి పనిచేస్తే చివరికి, మేము స్నేహితులము అవుతామని కూడా భాయ్ అన్నారు. సల్మాన్ - రష్మిక మందన్న జంటగా మురుగదాస్ తెరకెక్కించిన భారీ యాక్షన్ చిత్రం సికందర్ ఈద్ కానుకగా విడుదలకు సిద్ధమవుతోంది.