దసరా బరి.. సినిమాల లెక్క తేలిందా..?

స్టార్ సినిమాల మధ్య ఫైట్ సంక్రాంతికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో తెలిసిందే ముఖ్యంగా ఫెస్టివల్ టైంలో ఈ పోటీ మరింత రసవత్తరంగా ఉంటుంది;

Update: 2025-03-27 22:30 GMT
Telugu Cinema’s Biggest Dussehra Clash

సంక్రాంతి తర్వాత సినిమాల పండగ అంటే అది దసరా మాత్రమే. ఇయర్ సెకండ్ హాఫ్ లో ఎక్కువ రోజులు స్కూల్ హాలిడేస్ ఇచ్చే పెద్ద పండగ కాబట్టి ఆ టైంలో సినిమాలు రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ కళకళలాడుతుందని అంటారు. ప్రతి ఏడాది లాగానే దసరాకి భారీ సినిమాలు రిలీజ్ అవుతాయి. స్టార్ సినిమాల మధ్య ఫైట్ సంక్రాంతికి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో తెలిసిందే ముఖ్యంగా ఫెస్టివల్ టైంలో ఈ పోటీ మరింత రసవత్తరంగా ఉంటుంది.

ఈసారి దసరా బరిలో దిగే సినిమాల మీద ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు. ఐతే ప్రస్తుతానికి అఫీషియల్ గా ఏ సినిమా చెప్పకపోయినా ఈ దసరాకి సినిమాల ఫైట్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. ఈ దసరాకి బాలకృష్ణ అఖండ 2 వస్తుంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దసరాకి పర్ఫెక్ట్ ఫీస్ట్ ఇచ్చేలా అఖండ 2 రెడీ అవుతుంది.

మరోపక్క మెగా మేనల్లుడు సాయి తేజ్ సంబరాల యేటి గట్టు సినిమా కూడా దసరాకి రిలీజ్ అవబోతుంది. రోహిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. ఐతే ఈ మూవీని దసరా రిలీజ్ కి రెడీ అవుతున్నారు. వీటితో పాటుగా రెబల్ స్టార్ రాజా సాబ్ ని కూడా సరా బరిలో దించే ప్లానింగ్ లో ఉన్నారని టాక్. అదే జరిగే మాత్రమే దసరా కచ్చితంగా సంథింగ్ స్పెషల్ గా ఉండబోతుందని తెలుస్తుంది.

ఇవే కాకుండా ఫెస్టివల్ సీజన్ వస్తే తెలుగు బాక్సాఫీస్ పై డబ్బింగ్ సినిమాల హంగామా తెలిసిందే. అందుకే కచ్చితంగా దసరా ఫైట్ మన సినిమాలతో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ తో ఫైట్ ఉంటుందని అర్థమవుతుంది. ప్రస్తుతానికి బాలయ్య, తేజ్, ప్రభాస్ సినిమాలు మాత్రమే లైన్ లో ఉన్నాయి. ఐతే అప్పటికప్పుడు ఏ సినిమాలైనా దసరాకి రిలీజ్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా జూన్, జూలై రిలీజ్ అంటున్నారు. ఒకవేళ ఆ సినిమా కూడా దసరాకి వస్తే మాత్రం సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. ఈ సినిమాల ఫైట్ తో దసరాని మరింత కలర్ ఫుల్ గా చేసుకోవాలని ఫ్యాన్స్ ఖుషిగా ఉన్నారు.

Tags:    

Similar News