క్యామియో రోల్స్ అవసరమే.. కానీ అలా చేయొద్దు!!

ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ఆయా రోల్ కు సరైన విధంగా సెట్ అయ్యే క్యాస్టింగ్ ను.. మేకర్స్ ఎంచుకుని రంగంలోకి దించుతారు.;

Update: 2025-03-31 23:30 GMT
క్యామియో రోల్స్ అవసరమే.. కానీ అలా చేయొద్దు!!

క్యామియో రోల్.. ఎప్పటి నుంచో తెలుగు సినిమాల్లో వినిపిస్తున్న పదమే.. చిత్రాల్లోని స్పెషల్ రోల్స్ లో నటీనటులు కనిపిస్తుంటారు. అది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఆడియన్స్ ను ఆకట్టుకునేందుకు ఆయా రోల్ కు సరైన విధంగా సెట్ అయ్యే క్యాస్టింగ్ ను.. మేకర్స్ ఎంచుకుని రంగంలోకి దించుతారు.

అదే విషయాన్ని ప్రమోషన్స్ టైమ్ లో కూడా యూజ్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు క్యామియో రోల్స్ కోసం మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందువల్ల లాభం పక్కన పెడితే.. బడ్జెట్ తడిసిమోపడవుతోందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. అందుకు ఎగ్జాంపుల్స్ కూడా చెబుతున్నారు.

రీసెంట్ గా నితిన్ రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఆ సినిమాలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో రోల్ లో కనిపించారు. అందుకోసం ఆయనకు మేకర్స్ దాదాపు రూ.3 కోట్లు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. దీంతో అనేక మంది పెదవి విరిస్తున్నారు.

ఎందుకంటే సినిమాపై ఎఫెక్ట్ చూపించని వార్నర్ రోల్ కు అంత భారీ మొత్తంలో చెల్లించడం అవసరమా అని కామెంట్లు పెడుతున్నారు. ఆయన పాత్రకు సినిమాలో ఇంపార్టెన్స్ లేదని చెప్పాలి. దీంతో క్యామియో కోసం అంత ఖర్చు పెట్టి తెచ్చి ఏం లాభం ఉందని క్వశ్చన్ చేస్తున్నారు. అదే సమయంలో లైగర్ మూవీని ప్రస్తావనకు తీసుకొస్తున్నారు.

ఆ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ గెస్ట్ రోల్ లో కనిపించిన విషయం తెలిసిందే. అయితే మూవీ రిలీజ్ కు ముందు ఆయన రోల్ పై మేకర్స్ తెగ హైప్ క్రియేట్ చేశారు. కానీ రిలీజ్ అయ్యాక సినీ రివర్స్ అయింది. టైసన్ కు లైగర్ మేకర్స్.. రూ.20 కోట్లు ఇచ్చినట్లు టాక్ వినిపించింది. దాని వల్ల ఎలాంటి లాభం లేదని చెప్పాలి.

దీంతో అంత ఖర్చు పెట్టే బదులు.. సినిమాకు అవసరమైన వాటిపై మేకర్స్ ఫోకస్ పెడితే బాగుంటుందని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడి నుంచో తీసుకొచ్చి.. డబ్బులు వృథా చేయాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఒక్కసారి పునరాలోచించుకోవాలని అంటున్నారు. సరైన స్క్రిప్ట్, టాలెంటెడ్ క్యాస్టింగ్ ఉంటే చాలని చెబుతున్నారు. మరి ఫ్యూచర్ లో డైరెక్టర్స్ ఎలా ముందుకువెళ్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News