అంత పెద్ద స్టార్‌కి ప‌రిశ్ర‌మ‌ మ‌ద్ధ‌తు లేదా?

ఖాన్‌ల త్ర‌యంలో ఎవ‌రి ప్ర‌త్యేక‌త వారికి ఉంది. ఆ ముగ్గురికి భారీగా ఫాలోయింగ్ ఉంది.;

Update: 2025-04-04 03:32 GMT
అంత పెద్ద స్టార్‌కి ప‌రిశ్ర‌మ‌ మ‌ద్ధ‌తు లేదా?

ఖాన్‌ల త్ర‌యంలో ఎవ‌రి ప్ర‌త్యేక‌త వారికి ఉంది. ఆ ముగ్గురికి భారీగా ఫాలోయింగ్ ఉంది. ఇందులో స‌ల్మాన్ మ‌రింత స్పెష‌ల్. అత‌డి యాక్ష‌న్ సినిమాల‌కు ప్ర‌త్యేకించి మాస్ లో ఫాలోయింగ్ ఉంది. అయితే కొన్నేళ్లుగా భారీ బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న స‌ల్మాన్ ఖాన్ ఇటీవ‌ల త‌డ‌బ‌డుతున్నాడు. వ‌రుస‌గా ఫ్లాపులు ఎదుర‌వుతున్నాయి. ఇటీవ‌లే మాస్ యాక్ష‌న్ చిత్రం `సికంద‌ర్` చిత్రంతో అభిమానుల ముందుకు వ‌చ్చాడు. కానీ ఈ సినిమా ఆశించిన ఫ‌లితం అందుకోలేదు.

ఏ.ఆర్.మురుగ‌దాస్ తెర‌కెక్కించిన ఈ సినిమా రొటీన్ కంటంట్ తో నిరాశ‌ప‌రిచింద‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే త‌న సినిమా విఫ‌ల‌మైంద‌నే వార్త‌లు స‌ల్మాన్ ని క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి. ఈద్ సెల‌వుల్లో విడుద‌లై ఆరంభ వీకెండ్ 100 కోట్లు అందుకున్నా కానీ, ఆ త‌ర్వాత క‌లెక్ష‌న్ల ప‌రంగా చ‌తికిల‌బ‌డింది. ఈ స‌మ‌యంలో స‌ల్మాన్ తాజా ఇంట‌ర్వ్యూలో ప‌రిశ్ర‌మ నుంచి మ‌ద్ధ‌తు కావాల‌ని కోరుకున్నాడు. అంద‌రూ నా సినిమాల‌కు మ‌ద్ధ‌తు అవ‌స‌రం లేద‌ని అనుకుంటారు. కానీ నాతో స‌హా అంద‌రికీ మ‌ద్ధ‌తు కావాలి! అని త‌న‌కు ఎదురైన ఓ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చాడు.

నిజానికి స‌ల్మాన్ ఇత‌రుల సినిమాల‌ను ఎలాంటి భేష‌జం లేకుండా ప్ర‌మోట్ చేస్తాడు. అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ ల సినిమాల విజ‌యం కోసం అత‌డు చాలా చేసాడు. ఇటీవలే సన్నీ డియోల్ నటించిన `జాత్`కు మద్దతు ఇచ్చాడు. ఇది ఏప్రిల్ 10న విడుదల కానుంది. మోహ‌న్ లాల్-పృథ్వీరాజ్ ల‌ L2: ఎంపురాన్ కు కూడా శుభాకాంక్షలు తెలిపాడు. అయితే స‌ల్మాన్ సినిమాకి మాత్రం ప‌రిశ్ర‌మ నుంచి స‌రైన మ‌ద్ధ‌తు లేదు. ఎవ‌రూ దీనిగురించి పాజిటివ్ గా క‌నీసం ట్వీట్లు అయినా వేయ‌లేదు. దీంతో స‌ల్మాన్ భాయ్ బృందం అంద‌రి నుంచి మ‌ద్ధ‌తు కోరుతున్నారు.

Tags:    

Similar News