బుట్ట బొమ్మ మరీ అంత చీప్ అయ్యిందా..?
బుట్ట బొమ్మ పూజా హెగ్దే రెండేళ్ల క్రితం వరకు టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉండగా వరుస సినిమాలు నిరాశపరచడంతో అమ్మడికి అవకాశాలు రాలేదు;

బుట్ట బొమ్మ పూజా హెగ్దే రెండేళ్ల క్రితం వరకు టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉండగా వరుస సినిమాలు నిరాశపరచడంతో అమ్మడికి అవకాశాలు రాలేదు. హారిక హాసిని వారి గుంటూరు కారం సినిమా వచ్చినట్టే వచ్చి మిస్ అయ్యింది. అప్పటి నుంచి టాలీవుడ్ లో పూజా హెగ్దే సినిమా అంటూ రాలేదు. బాలీవుడ్ లో కూడా అమ్మడికి పెద్ద ఆశించిన జోష్ కనిపించట్లేదు. ఐతే ఉన్నంతలో పూజా హెగ్దేకి కోలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడు తమిళ్ లో రెండు క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది.
అందులో ఒకటి సూర్య రెట్రో సినిమా కాగా మరొకటి దళపతి విజయ్ జన నాయగన్. రెట్రో సినిమా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో వస్తుంది. ఈ సినిమా మే 1న రిలీజ్ లాక్ చేశారు. రెట్రో నుంచి ఈమధ్యనే వచ్చిన సాంగ్ తో పూజా హెగ్దే సందడి మొదలైంది. ఐతే కెరీర్ కాస్త అటు ఇటుగా ఉన్న టైం లో కోలీవుడ్ నుంచి వచ్చిన ఛాన్స్ కాబట్టి పూజా బేబీ రెమ్యునరేషన్ విషయంలో పట్టింపులు లేనట్టుగా ఉందని తెలుస్తుంది.
సౌత్ లో ముఖ్యంగా టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న టైం లో మంచి రెమ్యునరేషన్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఆఫర్లు వస్తే చాలు పారితోషికం సంగతి తర్వాత అన్నట్టుగా ఉంటుందట. రెట్రో సినిమాకు మామూలుగా ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ కన్నా చాలా తక్కువ తీసుకుందని చెబుతున్నారు. ఐతే రెట్రో సినిమాతో పూజా సౌత్ లో సూపర్ కంబ్యాక్ అవ్వాలని చూస్తుంది.
రెట్రోలో పూజా పాత్రకు కూడా మంచి వెయిట్ ఉంటుందని టాక్. అంతకుముందు పూజా అంటే కేవలం గ్లామర్ షో కోసమే అన్న టాక్ ఉండేది కానీ రెట్రో సినిమాలో మాత్రం అమ్మడి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అని టాక్. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ జన నాయగన్ లో కూడా పూజా సర్ ప్రైజ్ చేస్తుంది. ఐతే ఆ సినిమా రిలీజ్ కు చాలా టైం ఉంది కాబట్టి ఈలోగానే మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. కోలీవుడ్ సరే కానీ పూజా బేబీకి తెలుగులో మరో ఛాన్స్ ఎప్పుడంటూ ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఒకటి రెండు సినిమాల్లో పూజా హెగ్దే ని తీసుకుంటున్నారన్న డిస్కషనే తప్ప ఏది ఫైనల్ అవ్వట్లేదు.