జీరో సైజ్ నుంచి మైనస్ సైజ్‌కి సమంత
జీరో సైజ్ ఒకప్పటి ఫ్యాషన్. బెబో కరీనా కపూర్ దీనిని ఇంట్రడ్యూస్ చేసింది. కొన్నేళ్ల పాటు సైజ్ జీరో బ్యూటీగా ఏలింది కరీనా.;

జీరో సైజ్ ఒకప్పటి ఫ్యాషన్. బెబో కరీనా కపూర్ దీనిని ఇంట్రడ్యూస్ చేసింది. కొన్నేళ్ల పాటు సైజ్ జీరో బ్యూటీగా ఏలింది కరీనా. మళ్లీ ఆ రేంజులో మరో హీరోయిన్ కి అది వర్కవుట్ కాలేదు. చాలామంది కథానాయికలు తమ బొద్దందాన్ని తగ్గించుకుని, జీరో సైజ్ కి మారినా విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరికి మాత్రమే సూటయ్యేది జీరో సైజ్. కానీ దానిని ప్రతి ఒక్కరూ అనుసరించడం ఆశ్చర్యపరిచింది.
చాలా మంది ప్లస్ సైజ్ కథానాయికలు జీరో సైజ్ కోసం పాకులాటలో చివరికి ఉన్న అందాన్ని కూడా కోల్పోయారు. శరీరాకృతికి తగ్గట్టుగా సైజ్ డిసైడ్ అవ్వాల్సి ఉన్నా అతి చేసి ఏదో అయ్యారు కొందరు. ఇప్పుడు అందాల సమంత రూత్ ప్రభు బాలీవుడ్ లో ఎక్కువగా ఫోకస్ అవుతున్నందున జీరో సైజ్ పై పూర్తిగా దృష్టి సారించిందని అర్థమవుతోంది. సామ్ తాజా ఫోటోషూట్ చూసిన వారు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. తన సిటాడెల్ కోస్టార్ వరుణ్ ధావన్ తో కలిసి ఇటీవల ఓ ఈవెంట్లో ఫోటోగ్రాఫర్లకు కనిపించింది సమంత.
ఈ ఫోటోషూట్ లో సామ్ పూర్తిగా మైనస్ సైజ్ లో కనిపిస్తోంది. బాగా బక్క చిక్కిన సామ్ ని చూస్తుంటే తిండి లేక ఇలా అయిందా? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే డైటింగా? లేక ఇంకేదైనా అనోరోగ్యం కారణమా? అనేది ఆరాలు తీస్తున్నారు. అన్ని డౌట్లను క్లియర్ చేయడానికి నేరుగా సమంతనే రంగంలోకి దిగుతుందేమో కాస్త వేచి చూడాలి. తదుపరి సొంత బ్యానర్‌లో `బంగారం` సినిమాలో నటించడానికి సిద్ధమైన సమంత, అటు రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ తోను బిజీగా ఉంది.