దిశా నుంచి బ్రాండ్‌ని టేకోవర్ చేసిందా?
ఈ భామ జిమ్ లో కసరత్తులు చేస్తూ కెల్విన్ క్లెయిన్ ప్రచారంలో తలమునకలుగా కనిపించింది.;

ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ (సీకే) బ్రాండ్ ఇప్పుడు భారతదేశం సహా ప్రపంచ దేశాల్లో మార్మోగుతోంది. ముఖ్యంగా భారత్‌లోని మారుమూల గ్రామాల్లోను ఈ బ్రాండ్ యువతరంలోకి దూసుకెళ్లడానికి కారణం కచ్ఛితంగా దిశా పటానీ. ఈ భామ నిరంతరం సీకే లోదుస్తులు ధరించి వాటికి కావాల్సినంత ప్రచారం కల్పిస్తోంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో క్లిప్ లు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

అయితే దిశా పటానీ తో పాటు వేడెక్కించే హొయలు ప్రదర్శించే నేటితరం అందాల కథానాయికలతోను సీకే కంపెనీ ప్రచారం చేయించుకుంటోంది. ప్రగ్య జైశ్వాల్, అనన్య పాండే, కియరా అద్వాణీ, జాన్వీ కపూర్ సహా పలువురు అందాల భామలు సీకే బ్రాండ్ కి ప్రచారం కల్పించారు. ఇప్పుడు ఇదే జాబితాలో నటవారసురాలు పాలక్ తివారీ చేరింది.

ఈ భామ జిమ్ లో కసరత్తులు చేస్తూ కెల్విన్ క్లెయిన్ ప్రచారంలో తలమునకలుగా కనిపించింది. సీకే బ్రాండ్ టాప్, బాటమ్ ట్రాక్ ని ధరించిన పాలక్ టైట్ అందాలతో మతులు చెడగొడుతోంది. అసలే జిమ్ లో చెమటలు పట్టించేలా డంబెల్స్ తో వ్యాయామం చేస్తోంది. దానికి తోడు అందమైన స్మైల్ తో గుండెల్ని కొల్లగొడుతోంది. ప్రస్తుతం పాలక్ కసరత్తుల ఫోటోలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. సీకే కంపెనీ సరైన అందగత్తెను ఎంపిక చేసుకుందంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. సుమారు ఎకరం విస్తీర్ణంలో ఉన్న ఈ భారీ జిమ్ లో పాలక్ సోలోగా కోచ్ సమక్షంలో కసరత్తులు చేస్తూ ఫోటోషూట్ ని సోషల్ మీడియాల్లో వైరల్ చేసింది.
పాలక్ తివారీ బుల్లితెర నటి శ్వేతా తివారి నటవారసురాలు. సైఫ్ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీఖాన్ తో డేటింగ్ చేస్తోందనే పుకార్ ఉంది. మరోవైపు పాలక్ వరుస చిత్రాల్లో నటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. సంజూభాయ్ లాంటి సీనియర్ హీరోతో కలిసి భూత్నీ అనే హారర్ చిత్రంలోను పాలక్ నటించింది. ఈ హారర్ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలై ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఇది కాంచన తరహా హారర్ కామెడీ. స్త్రీ 2 ఘనవిజయం తర్వాత ఈ మూవీపైనా భారీ అంచనాలున్నాయి.