టాక్సిక్ యాక్షన్‌కి లేడీ సూపర్ స్టార్ రెడీ
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో నటించనుంది అంటూ మొదటి నుంచి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.;

కేజీఎఫ్ ప్రాంచైజీ తర్వాత యశ్ నటిస్తున్న చిత్రం 'టాక్సిక్'. కేజీఎఫ్ 2 తో వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు దక్కించుకున్న యశ్ తదుపరి సినిమా విషయంలో చాలా ఆలోచనలు చేసి చివరకు టాక్సిక్ కు ఓకే చెప్పాడు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ యాక్షన్ సినిమాను కేవలం ఇండియన్ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్‌లోనూ విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇంగ్లీష్ వర్షన్ కోసం స్పెషల్ యాక్షన్ సీన్స్‌తో పాటు, కొన్ని టాకీ సీన్స్‌ను చిత్రీకరించబోతున్నట్లు సమాచారం అందుతోంది. కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్‌డం దక్కించుకున్న యశ్ తాజా చిత్రం 'టాక్సిక్' కోసం అన్ని భాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
టాక్సిక్ సినిమాలో యశ్ కి జోడీగా కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌లో మోస్ట్ బిజీ హీరోయిన్‌గా ఉన్న ఈ అమ్మడు తల్లికాబోతున్న నేపథ్యంలో బ్రేక్ తీసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమా షూటింగ్‌ను ఆమె పూర్తి చేసిందా లేదంటే బ్రేక్ తర్వాత వచ్చి పూర్తి చేస్తుందా అనేది తెలియాల్సి ఉంది. మరో వైపు టాక్సిక్ లో కియారా అద్వానీతో పాటు బాలీవుడ్ మరో ముద్దుగుమ్మ హుమా ఖురేషి కీలక పాత్రలో కనిపించబోతుంది. యశ్, కియారా అద్వానీ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలో నటించనుంది అంటూ మొదటి నుంచి వార్తలు వస్తున్న విషయం తెల్సిందే.
ఇన్ని రోజులు టాక్సిక్ సినిమాలో నయనతార నటించబోతుంది అనే వార్తలను ఎక్కువ శాతం మంది పుకార్లు అనుకున్నారు. ఎట్టకేలకు ఆ వార్తలకు క్లారిటీ రాబోతుంది. టాక్సిక్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ అక్కడ జరుగుతోంది. యశ్‌తో పాటు కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటులు షూటింగ్‌లో పాల్గొన్నారు. మరికొన్ని రోజుల పాటు ఆ షెడ్యూల్ జరగబోతుంది. ఆ షెడ్యూల్‌లో నయనతార జాయిన్ కాబోతుంది. ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఈ విషయాన్ని దృవీకరించింది. చిత్ర యూనిట్ సభ్యులు ఈ విషయాన్ని తెలియజేసినట్లు సదరు కథనంలో పేర్కొన్నారు.
టాక్సిక్‌లో యశ్‌కి సోదరి పాత్రలో నయనతార నటించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. సినిమాలో ఆమె పాత్ర ఏంటి అనేది తెలియదు కానీ సినిమాలో ఆమె నటిస్తుంది అనే విషయమై దాదాపుగా కన్ఫర్మ్ అయింది. తమిళ్‌లో వరుసగా హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్న నయనతార ఇప్పుడు టాక్సిక్‌లో కీలక పాత్రలో కనిపించబోతుంది. గతంలోనూ నయనతార హీరో సోదరి పాత్రలో నటించింది. టాక్సిక్ సినిమాలో యశ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న నయనతార అంచనాలు పెంచడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం తమిళ్‌లో రెండు మూడు సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు టాక్సిక్ తో వచ్చేందుకు రెడీ అవుతోంది.