బ్లాక్ బస్టర్ డేట్ ఎందుకు మిస్ చేస్తున్నారు..?

సినిమా వాళ్లకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ. సినిమా ముహూర్తం రోజు నుంచి రిలీజ్ డేట్ వరకు జరిగే ప్రతి విషయాన్ని చాలా ప్లానింగ్ తో వస్తారు.;

Update: 2025-04-08 00:30 GMT
బ్లాక్ బస్టర్ డేట్ ఎందుకు మిస్ చేస్తున్నారు..?

సినిమా వాళ్లకు చాలా సెంటిమెంట్స్ ఎక్కువ. సినిమా ముహూర్తం రోజు నుంచి రిలీజ్ డేట్ వరకు జరిగే ప్రతి విషయాన్ని చాలా ప్లానింగ్ తో వస్తారు. పర్ఫెక్ట్ ముహుర్తాలు పెట్టుకుని వస్తారు కాబట్టే వారికి కొంతలో కొంత పాజిటివ్ రిపోర్ట్స్ వస్తాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కొన్ని సూపర్ హిట్ సినిమాల రిలీజ్ డేట్స్ పాజిటివ్ సెంటిమెంట్ తో కొన్ని సినిమాలు రిలీజ్ ప్లాన్ చేస్తారు. వాటిలో సంక్రాంతి సీజన్ 12, 13, 14 కాగా.. ఆగష్టు 15, క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 25 ఉంటాయి.

ఈ డేట్స్ లో తప్పనిసరిగా సినిమాల రిలీజ్ లు ప్లాన్ చేస్తారు. ఇక మరోపక్క కొన్ని ఐకానిక్ రిలీజ్ డేట్ లు కూడా ఉన్నాయి. ఆ డేట్ న వచ్చి ఇండస్ట్రీ రికార్డులు కొట్టిన సినిమాలు ఉన్నాయి. అందుకే ఆ డేట్స్ ని కూడా కొన్ని సినిమాలు సెంటిమెంట్స్ గా భావిస్తారు. అలాంటి డేట్స్ లో ఏప్రిల్ మంత్ ఎండ్ 28 ఉంది. ఏప్రిల్ 28న రిలీజై బ్లాక్ బస్టర్ కొట్టి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమాలు వచ్చాయి.

వాటిలో సూపర్ స్టార్ మహేష్ పోకిరి ఉంది. పూరీ జగన్నాథ్, మహేష్ కాంబోలో వచ్చిన ఈ సూపర్ హిట్ మూవీ అప్పటివరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నిటినీ తుడిచి పెట్టేసింది. ఇక ఆ తర్వాత ఆ డేట్ కి చాలా సినిమాలు వచ్చి అలరించాయి. మళ్లీ 2017 లో ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజైంది. ఆ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే.

ఐతే ఈసారి ఏప్రిల్ 28న పెద్దగా సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. అదేంటో ఒక సూపర్ హిట్ రిలీజ్ డేట్ ని వదిలి పెడుతున్నారు మేకర్స్. ఏప్రిల్ 10, ఆ నెక్స్ట్ వీకెండ్ ఏప్రిల్ 18న సినిమాలు వస్తున్నాయి కానీ ఏప్రిల్ 28న ప్రస్తుతానికి నోటెడ్ సినిమాలేవి రిలీజ్ లాక్ చేయలేదు. ఒకవేళ ఈసారి ముహూర్తం బాగాలేదా లేదా అంటే ఈసారి ఏప్రిల్ 28 మండే వచ్చింది. అందుకే సినిమాలు వీకెండ్ మాత్రమే రిలీజ్ చేయాలన్న సెంటిమెంట్ ఉంది కాబట్టి సోమవారం అయిన ఏప్రిల్ 28ని మిస్ చేసుకోవాల్సి వస్తుంది.

సో మంచి రిలీజ్ డేట్ అయినా వారం కుదరకపోవడంతో సినిమాలు లైట్ తీసుకున్నాయి. ఐతే ఏప్రిల్ 28న రిలీజై సెన్సేషనల్ హిట్ అందుకున్న సినిమాల గురించి తెలుసుకుంటూ ఆ డేట్ ఎంత లక్కీనో ఫ్యాన్స్ డిస్కస్ చేసుకుంటారని చెప్పొచ్చు.

Tags:    

Similar News