జైలర్ -2! లో బాలయ్య వర్సెస్ సూర్య!
సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ -2` పట్టాలెక్కిన సంగతి తెలిసిందే.;

సూపర్ స్టార్ రజినీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ -2` పట్టాలెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుగుతోంది. అయితే ఇందులో ఎంత మంది స్టార్ హీరోలు నటిస్తున్నారు? అన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
తొలి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్లు గెస్ట్ అప్పియిన్స్ తో అదొరగొట్టడంతో? `జైలర్ 2` లో అంతకు మించే ఉంటుంది తప్ప తగ్గడు అనే ప్రచారం తొలి నుంచి జరుగుతూనే ఉంది. టాలీవుడ్ నుంచి నటసింహా బాలకృష్ణ పవర్ ఫుల్ పాత్రలో రంగంలోకి దిగుతున్నారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. బాలయ్య మాస్ ఇమేజ్ కి ఏ మాత్రం తగ్గకుండా తెరపై కనిపించినంత సేపు విధ్వంసంలాగే పాత్ర నడుస్తుందని ప్రచారం జరిగింది.
కంటున్యూటీగా మోహన్ లాల్, శివన్న పాత్రలు యధావిధిగా ఉంటాయని వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో సంచలన నటుడి పేరు తెరపైకి వస్తోంది. కోలీవుడ్ విలక్షణ నటుడు సూర్య కూడా ఇందులో ఓ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. నెల్సన్ సూర్యతో చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలొస్తున్నాయి. దీనికి సంబంధించి త్వరలోనే నిర్మాణ సంస్థ నుంచి అధికారిక సమాచారం వెలువడుతుందని వినిపిస్తుంది.
నిజంగా సూర్య కూడా ఎంటర్ అయితే ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. బాలయ్య ను పాజిటివ్ రోల్ లో లాంచ్ చేసి సూర్య కు పవర్ పుల్ నెగిటివ్ రోల్ అప్పగించి..వాళ్లిద్దరి మధ్యా మాటల యుద్దం...భారీ యాక్షన్ సీన్ ప్లాన్ చేస్తే మామూలుగా ఉండదు. సూపర్ స్టార్ ఇమేజ్ సైతం కొట్టుకుపోయే పెర్పార్మెన్స్ తో అదర గొడతారు. ఆ సీన్స్ కు సూపర్ స్టార్ ఇమేజ్ టచ్ అప్ ఇస్తే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. బాలయ్య కు కోలీవుడ్ లో కూడా మాస్ ఫీల్ దక్కుతుంది. మరి నెల్సన్ ఎలాంటి వ్యూహంతో ఉన్నాడో చూడాలి.