పిక్‌టాక్ : అందాల ఏంజిల్‌ శ్రీలీల

ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలోనూ శ్రీలీల నటించింది.;

Update: 2025-03-25 16:39 GMT

కన్నడ సినిమాలతో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రీలీల టాలీవుడ్‌లో రాఘవేంద్ర రావు కొత్త సినిమా 'పెళ్లిసందడి'తో అడుగు పెట్టింది. టాలీవుడ్‌లో మొదటి సినిమా నిరాశ పరిచింది. అయినా కూడా తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. రాఘవేంద్ర రావు సినిమా హీరోయిన్‌ అంటే మినిమం ఉంటుంది. శ్రీలీల మొదటి సినిమా ఫలితంతో పట్టింపు లేకుండా వరుస ఆఫర్లు దక్కించుకుంది. లక్కీగా రవితేజతో నటించిన ధమాకా సినిమాతో సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ఆరు ఏడు సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఏకంగా సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలోనూ శ్రీలీల నటించింది.


మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాలో చేసిన కుర్చీ మడత పెట్టి డాన్స్‌కి అంతా ఫిదా అయ్యారు. అంతే కాకుండా శ్రీలీల ప్రతి సినిమాలోనూ ఏదో ఒకటి లేదా అంతకు మించిన పాటలతో ఆకట్టుకుంటూ వచ్చింది. సోషల్‌ మీడియాలో శ్రీలీలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప 2 సినిమాలో కిస్సిక్‌ అంటూ చేసిన ఐటెం సాంగ్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్‌గా వరుస సినిమాలు చేస్తుంది. డాన్స్‌తో పాటు నటనతోనూ ఆకట్టుకుంటున్న శ్రీలీల సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా వైరల్‌ అవుతోంది. మరోసారి శ్రీలీల తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేయడం ద్వారా వైరల్‌ అవుతోంది.


సన్నగా నాజూకుగా ఉండే శ్రీలీల ఈసారి ఏంజిల్‌ లుక్‌లో చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఆకట్టుకునే అందంతో పాటు ఫోటో జెనిక్‌ ఫేస్‌ అనిపించేంత అందంగా కనిపించే శ్రీలీల ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దేవ కన్య మాదిరిగా లైట్ బ్లూ కలర్‌లో మెరిసి పోతుంది. ఆకాశం నుంచి దిగి వచ్చిన ఏంజిల్‌ ఈమె అంటూ పలువురు కామెంట్‌ చేస్తున్నారు. ఇంత అందంగా ఉండటంతో పాటు డాన్స్‌తో మతి పోగొడుతుంది కనుకే శ్రీలీలకు టాలీవుడ్‌లో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. శ్రీలీల షేర్‌ చేసిన ఈ ఫోటోలకు మంచి స్పందన దక్కింది. నిమిషాల వ్యవధిలోనే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. దాదాపుగా 12 మిలియన్‌ల ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న శ్రీలీల ఇలాంటి ఫోటోలను మరిన్ని షేర్‌ చేయాలని అభిమానులు కోరుతున్నారు.


శ్రీలీల అమెరికాలోని మిచిగాన్‌లో డెట్రాయిట్‌కి చెందిన ఒక తెలుగు కుంటుంబంలో జన్మించింది. బెంగళూరులో పెరిగిన శ్రీలీల తల్లి ఏపీకి చెందిన ఒంగోలుకు చెందిన వారు. దాంతో శ్రీలీల తెలుగు మూలాలు కలిగిన వ్యక్తి. అందుకే తెలుగు చక్కగా మాట్లాడుతుంది. తెలుగు అమ్మాయిలకు తెలుగు సినిమాల్లో ఆఫర్లు రావని, వచ్చినా కేవలం చిన్న సినిమాలకే పరిమితం అనే అభిప్రాయం ఉండేది. కానీ శ్రీలీల పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోల సినిమాల్లో నటించడం ద్వారా స్టార్‌ హీరోయిన్‌గా నిలిచింది. ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా కోలీవుడ్‌లోనూ శ్రీలీల నటిస్తోంది. ఈ ఏడాది శ్రీలీల నటిస్తున్న మూడు నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News