చాహల్ - ధనశ్రీ విడాకుల వెనక అసలు గుట్టు
కేవలం 10 నెలలు మాత్రమే కొనసాగిన ఈ వివాహ బంధం అధికారికంగా ముగిసింది.;
టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ - కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ అధికారికంగా విడిపోయారు. బాంద్రాలోని కుటుంబ కోర్టు ఇరు పక్షాలు దాఖలు చేసిన ఉమ్మడి పిటిషన్ ఆధారంగా విడాకులు మంజూరు చేసింది. కేవలం 10 నెలలు మాత్రమే కొనసాగిన ఈ వివాహ బంధం అధికారికంగా ముగిసింది.
ఆ ఇద్దరూ విడిపోవడం వెనక కారణాలపై అభిమానులు రకరకాలుగా ఊహించారు. తాజాగా ఈ జంట విడిపోవడానికి అసలు కారణం బయటపడింది. చాహల్ - ధనశ్రీ ఎప్పుడూ ఒకరికొకరు పూర్తిగా అనుకూలంగా లేరు. వారు ఇద్దరు పూర్తిగా భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న వ్యక్తులు అని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వివాహం తర్వాత జీవనశైలి, మనస్తత్వాలు, ఫ్యామిలీ ధృక్పథాల్లో తేడాలు క్రమంగా మరింత స్పష్టంగా బయటపడ్డాయి.
అయితే విడిపోవడానికి ఒక ప్రధాన కారణం ఎక్కడ నివసించాలనే దానిపై భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. వివాహం తర్వాత ఈ జంట హర్యానాలో చాహల్ తల్లిదండ్రులతో నివసించారు. అవసరమైనప్పుడు మాత్రమే ముంబైకి వెళ్లారు. కానీ ధనశ్రీ యుజ్వేంద్రను ముంబైకి శాశ్వతంగా నివాసం మార్చాలని పట్టుబట్టినట్లు మసాలా డాట్ కాంలో కథనాలొచ్చాయి. ఎక్కడ నివశించాలి? అనే డిమాండ్ తీవ్రమైన చర్చలు, వాదోపవాదాలు, భిన్నాభిప్రాయాలకు దారితీసింది. తన మూలాలు, కుటుంబంతో లోతైన అనుబంధం ఉన్న చాహల్ హర్యానాను విడిచిపెట్టడానికి నిరాకరించాడు. ఇది ధనశ్రీకి నచ్చలేదు. విడాకుల సమయంలో ఒకరిపై ఒకరు తమదైన శైలిలో విమర్శల్ని ఎక్కుపెట్టారు. `మీ సొంత షుగర్ డాడీగా ఉండండి! అని రాసి ఉన్న టీ-షర్టు ధరించి చాహల్ బాంద్రా ఫ్యామిలీ కోర్టులో కనిపించడంతో ఆ పంచ్ ధనశ్రీపైనే అని అర్థం చేసుకున్నారు. అదే సమయంలో ధనశ్రీ పెళ్లి ప్రేమలో ఎఫైర్ గురించి ప్రస్థావిస్తూ ఒక పాటను విడుదల చేసింది. ఇది రకరకాల ఊహాగానాలకు ఆజ్యం పోసింది.
చాహల్ ఆర్జే మహవాష్‌తో సన్నిహితంగా కనిపించడంతో రకరకాల ఊహాగానాలు సాగాయి. అయితే ధనశ్రీ పేరు కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో ముడిపెడుతూ కథనాలొచ్చాయి. ఆ ఇద్దరూ బహిరంగంగా మౌనంగా ఉన్నా, ఒకరిపై ఒకరు గుర్రుగా ఉన్నారు. జీవన శైలిలో తేడాలు, ఇతర వ్యక్తిగత కారణాలతో వారు దూరమయ్యారని కథనాలొస్తున్నాయి.
ధనశ్రీపై క్రికెటర్ రోహిత్ శర్మ భార్య పంచ్:
మరోవైపు ధనశ్రీ వర్మ ప్రేమతో కాకుండా డబ్బు కోసం చాహల్ ని పెళ్లాడిందనే అర్థం వచ్చేలా ఒక జర్నలిస్ట్ రాసిన కథనానికి క్రికెటర్ రోహిత్ శర్మ భార్య రితిక లైక్ కొట్టడంతో ఇప్పుడు అది చర్చగా మారింది. చాహల్ తో బ్రేకప్ సమయంలో ధనశ్రీ వర్మ 4.75 కోట్లు అందుకుందని కథనాలొచ్చాయి. దీంతో డబ్బు కోసమే ఇదంతా చేసిందని చాలా మంది ధనశ్రీ వ్యక్తిత్వాన్ని తప్పు పట్టారు.