మంచు ఫ్యామిలీ గొడ‌వ‌పై పెద్ద కోడ‌లు ఏమ‌న్నారంటే?

మంచు విష్ణు స‌తీమ‌ణి విరానికా రెడ్డి సినిమా ఈవెంట్ల‌లో క‌నిపించ‌డం చాలా త‌క్కువ‌. మీడియా లో క‌ని పించ‌డం కూడా చాలా త‌క్కువ‌.;

Update: 2025-03-25 16:30 GMT

మంచు విష్ణు స‌తీమ‌ణి విరానికా రెడ్డి సినిమా ఈవెంట్ల‌లో క‌నిపించ‌డం చాలా త‌క్కువ‌. మీడియా లో క‌ని పించ‌డం కూడా చాలా త‌క్కువ‌. ఎప్పుడూ ఫ్యామిలీతో ఉంటారు? త‌ప్ప విష్ణుకు సంబంధించిన సినిమా విష‌యాలు స‌హా మ‌రే సంగ‌తుల్లోనూ ఆమె ఇన్వాల్వ్ కారు. భర్త‌, పిల్ల‌లు, కుటుంబం త‌ప్ప మ‌రో వ్యాపకంతో సంబంధం లేకుండా ఉంటారు. మీడియాకు ఆమె ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం కూడా ఎప్పుడూ జ‌ర గ‌దు.

తాజాగా తొలిసారి విరానికా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలో జీవన శైలి..పిల్ల‌లు..భ‌ర్త విష్ణు గురించి కొన్ని విష‌యాలు పంచుకున్నారు. అలాగే మంచు ఫ్యామిలీ లో త‌లెత్తిన వివాదం గురించి కొన్ని విష‌యాలు పంచుకున్నారు. అవేంటో ఆమె మాట‌ల్లోనే.. ప్ర‌తీ కుటుంబంలో స‌మ‌స్య‌లుంటాయి. మా కుటుంబానికి కూడా దుర‌దృష్ట‌వ‌శాత్తు అలాంటి స‌మ‌స్య‌లొచ్చాయి. మా విష‌యం అంద‌రికీ తెలిసింది.

ఇది మొత్తం కుటుంబంపై ప్ర‌భావాన్ని చూపుతుంది. ఆందోళ‌న ప‌డేది ఇక్క‌డ పిల్ల‌ల గురించే. ఇలాంటి విష‌యాలు పిల్ల‌ల‌పై ఎక్కువ ప్ర‌భ‌వాన్ని చూపిస్తాయి. కుటుంబంలోని సోదరుల మధ్య జరుగుతున్న తగాదాలను చూసి పిల్లలు భయపడుతున్నారు. ఏమి జరుగుతుందోన‌ని ఆలోచిస్తున్నారు. ఇవి పిల్లల సహజ స్వభావాలు. పిల్లలు తెలివిగా ఉండాలంటే నేను కూడా అంతే తెలివిగా వ్య‌వ‌రించాలి.

నాకు నా పిల్ల‌లు ముఖ్యం. ఆ ప్ర‌భావం వారిపై ప‌డ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త నాదే. అందుకు నేను తీసుకునే జాగ్ర‌త్త‌లు ఎంతో ముఖ్య‌మైన‌విగా ఉండాలి. అలాంటి వాటి ప‌ట్ల వారు ఆక‌ర్షితులు కాకుండా వారిని జాగ్ర‌త్త‌గా చూసుకోవాలి` అని అన్నారు. కుటుంబ వ్య‌వ‌హారాల గురించి అడ‌గ‌గానే విరానికా ఇంత ఓపెన్ గా మాట్లాడ‌టం విశేషం. సాధార‌ణంగా ఇంట‌ర్వ్యూల్లో కుటుంబ విష‌యాల గురించి మాట్లాడ‌టానికి ఎవ‌రూ అంగీక‌రించ‌రు. కానీ విరానికా ఎంతో బ్యాలెన్స్ గా మాట్లాడారు.

Tags:    

Similar News