చిలసౌ హీరోయిన్ ఎక్కడ..?

అది కాస్త పర్వాలేదు అనిపించినా మిగతా సినిమాలన్నీ కూడా పెద్దగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.;

Update: 2025-03-25 18:30 GMT

ఏడేళ్ల క్రితం చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ రుహాని శర్మ. ఆ సినిమాలో అమ్మడి యాక్టింగ్ కి తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. స్ట్రాంగ్ ఉమెన్ రోల్ లో రుహాని నటన ఆకట్టుకుంది. ఐతే ఆ సినిమా తర్వాత రుహాని శర్మ హిట్ సినిమా చేసింది. అది కాస్త పర్వాలేదు అనిపించినా మిగతా సినిమాలన్నీ కూడా పెద్దగా ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అంతేకాదు చేసినా ఆ సినిమాలు కూడా అంత బజ్ క్రియేట్ చేయలేదు.

అందుకే మంచి నటి అని క్రేజ్ తెచ్చుకున్నా కూడా రుహాని శర్మ అవకాశాలు అందుకోలేదు. లాస్ట్ ఇయర్ విక్టరీ వెంకటేష్ తో సైంధవ్ సినిమా చేసింది ఈ అమ్మడు. అంతేకాదు శ్రీరంగ నీతులు, ఆపరేషన్ వాలెంటైన్, లవ్ మీ సినిమాల్లో నటించింది. వీటితో పాటు హిందీలో బ్లాక్ అవుట్ సినిమాలో కూడా నటించింది.

ప్రస్తుతం మాస్క్ అనే తమిళ సినిమాలో నటిస్తుంది రుహాని శర్మ. ఐతే తెలుగులో అమ్మడికి గుర్తింపు వచ్చినా కూడా స్టార్ ఛాన్స్ లు రాలేదు. అంతేకాదు చిలసౌ తర్వాత కథలు, సినిమాల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే రుహాని శర్మ కెరీర్ ఇలా ఉందని చెప్పొచ్చు. ఇలా వచ్చి అలా స్టార్ డం తెచ్చుకుంటున్న హీరోయిన్స్ ఉండగా ఇంత టాలెంట్ ఉన్నా సరే రుహాని శర్మ పాపులారిటీ విషయంలో వెనకపడింది.

ఐతే సినిమాల కన్నా రుహాని క్రేజీ ఫోటో షూట్స్ కి ఎక్కువమంది ఫ్యాన్స్ ఉన్నారు. గ్లామర్ షో విషయంలో కూడా రుహాని బ్లాస్ట్ చేస్తుంది. రుహాని ఫోటో షూట్ వచ్చింది అంటే ఫాలోవర్స్ అంతా కూడా ఫుల్ ఖుషి అవుతారు. సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న భామల్లో ఒకరైన రుహాని సినిమాల విషయంలో మాత్రం ఆశించిన విధంగా అవకాశాలను అందుకోవట్లేదు.

మరి రుహాని శర్మ తెలుగులో కూడా వరుస ఛాన్స్ లు అందుకుంటే చూడాలని తెలుగు ఆడియన్స్ కోరుతున్నారు. గ్లామర్ షోలో నెక్స్ట్ లెవెల్ ట్రీట్ అందించే రుహాని యాక్టింగ్ లో కూడా పాత్రకి పూర్తిస్థాయి న్యాయం చేస్తుంది. మరి అలాంటి టాలెంట్ ఉన్న భామ ఇలా ఖాళీగా ఉండటం ఏమాత్రం మంచిది కాదని చెప్పొచ్చు. మరి రుహాని శర్మ ఇక మీదట అయినా సినిమాల విషయంలో గేర్ మర్చి ప్రయత్నిస్తే వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.

Tags:    

Similar News