సెలవులను టార్గెట్ చేసిన ఓటీటీ సినిమాలివే
ఈ నేపథ్యంలోనే ఈ వారం పలు సినిమాలను రెడీ చేయడానికి ఓటీటీ సంస్థలు రెడీ అయిపోయాయి. మరి ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో ఏమేం రిలీజవుతున్నాయో చూద్దాం.;

ఈ వారం మొత్తం పండగలతో నిండిపోయింది. ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి ఇలా వరుస సెలవులున్నాయి. ఈ సెలవులను ఆల్రెడీ పలు సినిమాలతో థియేటర్లు వాడుకుంటే ఇప్పుడు ఓటీటీ కూడా వాటిని వాడుకుని ఆడియన్స్ ను అలరించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వారం పలు సినిమాలను రెడీ చేయడానికి ఓటీటీ సంస్థలు రెడీ అయిపోయాయి. మరి ఏ డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో ఏమేం రిలీజవుతున్నాయో చూద్దాం.
టెస్ట్: ఈ వారం వస్తున్న ఓటీటీ సినిమాల్లో ఇదే పెద్ద సినిమా. మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ లాంటి స్టార్ క్యాస్టింగ్ ఉన్న ఈ సినిమా ఏప్రిల్ 4న నెట్‌ఫ్లిక్స్ లో రిలీజ్ కానుంది. ఈ మూవీ నేరుగా ఓటీటీలోనే రిలీజవుతుంది. చెన్నైలో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందనే కథ ఆధారంగా టెస్ట్ రూపొందింది.
హోమ్ టౌన్: ఇక ఆహా లో హోమ్ టౌన్ అనే సిరీస్ రాబోతుంది. రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ ప్రధాన పాత్రల్లో ఆహా ఈ సిరీస్‌ను రూపొందించింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సిరీస్ కు శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించగా 90స్ వెబ్ సిరీస్ ప్రొడ్యూసర్ నవీన్ మేడారం హోమ్ టౌన్ ను నిర్మించారు. ఏప్రిల్ 4 నుంచి ఈ వెబ్ సిరీస్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఐడెంటిటీ: అఖిల్ పాల్, అనాస్ ఖాన్ దర్శకత్వంలో మలయాళ నటుడు టోవినో థామస్, త్రిష ప్రధాన పాత్రల్లో వచ్చిన థ్రిల్లర్ ఐడెంటిటీ. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా పాసబుల్ థ్రిల్లర్ గా గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి ఈ మూవీ జీ5 ప్రసారం కానుంది.
ఎ రియల్ పెయిన్: డేవిడ్, బెంజి అనే ఇద్దరు కజిన్స్ పోలాండ్ పర్యటనలో తమ గ్రాండ్ మదర్ ను కలుస్తారు. ఈ నేపథ్యంలో వారి పాత కుటుంబ కలహాల మధ్య జరిగే అడ్వెంచర్ గా ఈ సినిమా తెరకెక్కింది. జెస్సీ ఐసెన్ బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 3 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటూ ఐట్యూన్స్, బుక్ మై షోలో జ్యూరర్2 ఏప్రిల్ 1న రిలీజ్ కానుంది.