నెట్‌ఫ్లిక్స్ తెలివి తక్కువ నిర్ణయం!
అందుకే వాటి నుంచి కొత్త సీజన్ వచ్చిన ప్రతి సారి హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తున్నారు.;
భాషతో సంబంధం లేకుండా ఓటీటీ ప్రేక్షకులు అన్ని రకాల కంటెంట్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏ భాషలో రూపొందినా స్థానిక భాషలో డబ్బింగ్ చేస్తే చాలు ఓటీటీలో మంచి స్పందన దక్కించుకుంటున్న వెబ్ సిరీస్‌లు చాలా ఉన్నాయి. ది ఫ్యామిలీ మ్యాన్, మీర్జాపూర్‌తో పాటు మరికొన్ని వెబ్ సిరీస్‌లు హిందీ భాషలోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. అందుకే వాటి నుంచి కొత్త సీజన్ వచ్చిన ప్రతి సారి హిందీతో పాటు అన్ని భాషల్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తున్నారు. కానీ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల స్ట్రీమింగ్ అయిన 'ఖాకీ : ది బెంగాల్ చాప్టర్' వెబ్ సిరీస్‌ను తెలుగు, ఇతర సౌత్ భాషల్లో స్ట్రీమింగ్ చేయక పోవడంను తెలివి తక్కువ నిర్ణయం అంటూ పలువురు నెటిజన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
'ఖాకీ : ది బీహార్ చాప్టర్'కి హిందీలోనే కాకుండా సౌత్ భాషల్లోనూ మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఖాకీ వెబ్ సిరీస్‌ను ఎక్కువగా చూశారు. ఆ విషయం సోషల్ మీడియా ద్వారా నెట్‌ఫ్లిక్స్ వారు పలు సందర్భాల్లో చెప్పకనే చెప్పారు. సౌత్‌లో మంచి స్పందన దక్కించుకున్న ఖాకీ వెబ్ సిరీస్‌కి సీక్వెల్ అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో ఖాకీ : ది బెంగాల్ చాప్టర్' వెబ్ సిరీస్ కోసం ఎదురు చూసే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారు అందరికీ నెట్‌ఫ్లిక్స్ షాక్ ఇచ్చింది. కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేయడంతో తెలుగు ప్రేక్షకులు కొందరు సబ్ టైటిల్స్ పెట్టుకుని చూడాల్సిన పరిస్థితి వచ్చింది.
మొదటి సీజన్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పుడు సహజంగానే సెకండ్ సీజన్‌పై అన్ని భాషల్లోనూ అంచనాలు, ఆసక్తి ఉంటుంది అనే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ గుర్తించడంలో విఫలం అయింది. తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ ఖాకీ : ది బెంగాల్ చాప్టర్ వెబ్ సిరీస్‌కి ఉన్న ఉన్న ఆసక్తిని నెట్‌ఫ్లిక్స్ గుర్తించలేదు. అందుకే కేవలం హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ చేసింది. త్వరలో తెలుగు, ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ హిందీతో పాటు ఇతర భాషల్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ చేసి ఉంటే ఫలితం అప్పుడు మరోలా ఉండేది అనేది ఓటీటీ పరిశీలకుల అభిప్రాయం.
మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఖాకీ : ది బెంగాల్ చాప్టర్ వెబ్ సిరీస్‌కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 7 ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్‌కి దేబత్మా మండల్
తుషార్ కాంతిరే దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌లో జీత్, ప్రోసేన్‌జిత్ ఛటర్జీ, పరంబ్రత ఛటర్జీ, చిత్రాంగద సింగ్, పూజా చోప్రా తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. జీత్ గంగూలీ ఈ వెబ్ సిరీస్‌కు సంగీతాన్ని అందించాడు. బీహార్ చాప్టర్‌తో పోల్చితే బెంగాల్ చాప్టర్ మరింత ఆసక్తికర ఎపిసోడ్స్‌తో సాగుతుందని ప్రేక్షకులు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఖాకీ : ది బెంగాల్ చాప్టర్ కి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ నేపథ్యంలో సౌత్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు స్థానిక భాషల్లో సిరీస్‌ను చూడాలా అని ఎదురు చూస్తున్నారు. వచ్చే వారం వరకు నెట్‌ఫ్లిక్స్ సౌత్ భాషల్లో ఖాకీని అందుబాటులోకి తెస్తుందేమో చూడాలి.