బిగువుల ప్రదర్శన సరే వ్వాట్ నెక్ట్స్ రాశీ?
రాశీ పర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీని హైలైట్ చేస్తూ ఈ ఫోటోషూట్ గుబులు పుట్టిస్తోంది.;
నేటి జనరేషన్ స్టార్స్ లో తెలివైన ఎంపికలతో కెరీర్ బండిని నడిపిస్తున్న భామగా రాశీ ఖన్నాకు గుర్తింపు ఉంది. టాలీవుడ్ లో యంగ్ హీరోల సరసన నటిస్తూనే, దర్శకద్వయం రాజ్ అండ్ డీకే ప్రాజెక్ట్ `ఫర్జీ`లో నటించింది. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఈ బ్యూటీ పాన్ ఇండియాలో అభిమానులను ఫిదా చేసింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిందీ చిత్రాల్లో నటించేందుకు ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఆరణ్మనై 4 తో కమర్షియల్ విజయం అందుకుంది.
ది సబర్మతి రిపోర్ట్, సర్ధార్ లాంటి సినిమాలు తనకు నటిగా మంచి పేరు తెచ్చాయి. తెలుసు కదా! అనే తెలుగు చిత్రంలోను ఈ బ్యూటీ నటిస్తోంది. అటు బాలీవుడ్ లో ఇంకా టైటిల్ నిర్ణయించని ఎ క్రేజీ మూవీలో నటిస్తోంది. కెరీర్ మ్యాటర్ ఇలా ఉండగానే, రాశీ యూత్ లో తన ఫాలోయింగ్ ఎంతమాత్రం తగ్గకుండా జాగ్రత్త పడుతోంది. ప్రస్తుత కాంపిటీషన్ లో తనను తాను నిలబెట్టుకునేందుకు వరుస ఫోటోషూట్లతో ఫ్యాన్ డమ్ కి టచ్ లో ఉంది.
రాశీ తాజాగా తన ఫిట్నెస్ గురూ కుల్ దీప్‌తో కలిసి జిమ్ లో శ్రమిస్తున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది. రాశీ పర్ఫెక్ట్ ఫిట్ టోన్డ్ బాడీని హైలైట్ చేస్తూ ఈ ఫోటోషూట్ గుబులు పుట్టిస్తోంది. బ్లాక్ అండ్ బ్లాక్ - ఆల్ బ్లాక్ ట్రాక్ లో ఉన్న ఈ ఫోటోగ్రాఫ్స్ ఇంటర్నెట్ లో తుఫాన్ సృష్టిస్తున్నాయి. రాశీ నడుము నెమ్మదిగా జీరో నుంచి మైనస్ సైజ్ కి తగ్గిపోవడం ఖాయమని ఈ హార్డ్ వర్క్ చెబుతోంది. కొంత కఠినమైన వ్యాయామ సెషన్స్ కి రాశీ ఖన్నా అటెండవుతోంది. ``నేను ఏడవకుండా ఆ సెషన్‌లో బయటపడ్డాను. సెల్ఫీలు తీసుకునేంత అందంగా అనిపించింది! అంటూ కొంటె ఫన్నీ ఈమోజీని రాశీ షేర్ చేసింది. రాశీని షేపప్ చేసేందుకు కోచ్ కుల్ దీప్ సేథి చాలా శ్రమిస్తున్నారనడానికి ఈ ఫోటోలే ప్రూఫ్.