హిట్ 3 'ప్రేమ వెల్లువ' - వైల్డ్ ఆఫీసర్ లో లవ్ యాంగిల్!

ఇందులో భాగంగా తొలి పాటను ‘ప్రేమ వెల్లువ’ పేరుతో విడుదల చేశారు. ప్రేమ పాటు ఓ నెమ్మదైన పేస్‌ను కలిగిన ఈ పాట ఓ క్లాసిక్‌ అనిపించేలా ఉంది.;

Update: 2025-03-24 06:19 GMT

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న హిట్ 3 సినిమా ప్రతి అప్‌డేట్‌తోనూ అభిమానుల అంచనాలను పెంచుకుంటూ పోతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో సినిమా ఇంటెన్సిటీ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే పట్ల ఆసక్తి పెరిగింది. అర్జున్ సర్కార్ పాత్రలో నాని నెవ్వర్ బిఫోర్ అనే వైల్డ్ ఆఫీసర్ గా కనిపించనున్నట్లు ఓ క్లారిటీ ఇచ్చేశారు. మే 1న ఈ చిత్రం విడుదల కానుండటంతో, మేకర్స్ ప్రమోషన్లలో వేగం పెంచారు.


ఇందులో భాగంగా తొలి పాటను ‘ప్రేమ వెల్లువ’ పేరుతో విడుదల చేశారు. ప్రేమ పాటు ఓ నెమ్మదైన పేస్‌ను కలిగిన ఈ పాట ఓ క్లాసిక్‌ అనిపించేలా ఉంది. ముఖ్యంగా అంతటి వైల్డ్ ఆఫీసర్ లో ఇంతటి ప్రేమికుడు కూడా ఉన్నాడా అనే భవన్ కలిగేలా ఈ సాంగ్ ను మలిచారు. మిక్కీ జే మేయర్ మెలోడీ ట్రాక్ లో ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరాం తన గానంతో మరోసారి మాయ చేశాడు. గాయని నూతన మోహన్ గళం కూడా అందుకు అద్భుతంగా కలిసి వచ్చింది.

ఈ ఇద్దరి కలయిక ఈ పాటను మరింత భావోద్వేగంగా మలిచింది. కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ సాధారణ ఆడియెన్స్ కు కూడా వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. పాటకు అసలైన హైలైట్ నాని – శ్రీనిధి శెట్టి మధ్య కెమిస్ట్రీ. చాలా సున్నితంగా, సహజంగా దర్శకుడు సైలేష్ కొలను ఈ లవ్ ట్రాక్‌ను డిజైన్ చేశాడు. హిట్ లాంటి ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌లో ఈ ప్రేమకథ ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ లేయర్‌ను అందించనుందనే అభిప్రాయం కలుగుతోంది.

సినిమాలోని హార్డ్‌కోర్ యాక్షన్ లైన్‌కు ఇది మంచి కౌంటర్ ఎలిమెంట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. విజువల్‌గా కూడా పాట చాలా న్యాచురల్‌గా కనిపిస్తోంది. ఓ ఫీల్‌గుడ్, డీప్ కనెక్ట్ ఉన్న ప్రేమకథను పెద్దగా సినిమాటిక్‌గా కాకుండా సింపుల్‌గా చూపించారు. నాని పాత్రలో ఒక రఫ్ అండ్ టఫ్ పోలీస్ వెర్షన్ ఉండగా, ఈ పాటలో ఆయన సాఫ్ట్ సైడ్‌ను చూపించడం సినిమాకు మంచి డైమెన్షన్ ఇస్తోంది. శ్రీనిధి పాత్రకు కూడా ఇది బలాన్ని ఇచ్చేలా ఉంది.

ఇక ఈ సినిమా ప్రమోషన్లకు ఇది ఓ గొప్ప స్టార్ట్ అనే చెప్పాలి. హిట్ ఫ్రాంచైజీలో ఇది మూడో కేస్ కావడం, ముందు రెండు భాగాలు సక్సెస్ కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రశాంతి త్రిపినేని నిర్మిస్తున్న ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇక మే 1న థియేటర్లలో ఈ క్రైమ్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

Full View
Tags:    

Similar News