మరో బిడ్డకు జన్మనిచ్చిన అందాల అమీజాక్సన్!
నటి అమీజాక్సన్ మళ్లీ తల్లైంది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకు అప్పుడే పేరు కూడా పెట్టేసారు.;
నటి అమీజాక్సన్ మళ్లీ తల్లైంది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాబుకు అప్పుడే పేరు కూడా పెట్టేసారు. ఆస్కార్ అలెగ్జాండర్ అంటూ నామకరణం చేసారు. ఈ విషయం బయటకు పొక్కడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా అమీజాక్సన్ కు విషెస్ తెలియజేస్తున్నారు. అమీజాక్సన్ రెండవ భర్తకు పుట్టిన బిడ్డ.
గత ఏడాది ఎడ్వర్డ్ వెస్ట్ విక్ ను ప్రేమ వివాహం చేసుకుంది. దంపతులిద్దరు సోషల్ మీడియా ఈ విష యాన్ని ప్రకటించారు. ఇద్దరు పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసారు. అమీజాక్సన్ పాస్ట్ లైఫ్ లోకి వెళ్తే అమ్మడు పెళ్లి కాకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడం అప్పట్లో ఎంత సంచలనమైదో తెలిసిందే. నటిగా ఫాంలో ఉన్న సమయంలో వ్యాపారవేత్త జార్జ్ పనియోటౌతో ప్రేమలో పడింది.
కొన్నాళ్ల పాటు ఇద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఆ సమయంలోనే అమీజాక్సన్ గర్బం దాల్చింది. ప్రసవం తర్వాత పెళ్లి చేసుకుంటామని తెలిపింది. కానీ కొన్ని రోజులకే ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో విడి పోయారు. ఆ తర్వాత కొంత కాలం సింగిల్ గానే ఉంది. అటుపై బ్రిటన్ నటుడు, మ్యూజిషన్ తో ఎడ్ వెస్ట్ విక్ తో ప్రేమలో పడింది. ప్రస్తుతం విదేశాల్లోనే స్థిరపడింది.
అమీజాక్సన్ సినిమాల కెరీర్ పెద్ద చిత్రాలతోనే ప్రారంభమైంది. రామ్ చరణ్, విక్రమ్, శంకర్ లాంటి స్టార్స్ తోనే పనిచేసింది. రజనీకాంత్ హీరోగా నటించిన `2.0`లోనూ హీరోయిన్ గా నటించింది. అన్ని భారీ ప్రాజెక్ట్ లే. కానీ ఇవేవి అమీజాక్సన్ కెరీర్ కి బలమైన పునాదిని వేయలేకపోయాయి. నటిగా అమ్మడు ఫెయిలైంది. దీంతో కాలక్రమంలో సినిమా అవకాశాలు తగ్గాయి. ఆరేడేళ్ల తర్వాత గత ఏడాది తమిళ్, హిందీలో రెండు సినిమాలు చేసింది. ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు.