మ్యాడ్ క్యూబ్ కూడా ఉందండోయ్!
`మ్యాడ్` కి సీక్వెల్ గా అదే టీమ్ తో `మ్యాడ్ స్క్వేర్` కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే.;
`మ్యాడ్` కి సీక్వెల్ గా అదే టీమ్ తో `మ్యాడ్ స్క్వేర్` కూడా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మరోసారి హిట్ ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తుంది. పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.. లాజిక్కులు వెతక్కుండా? కథ ఉందా ? లేదా? అని విశ్లేషణలకు లేకుండా రెండున్నర గంటల పాటు చూడగల్గితే ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసే గొప్ప చిత్రమవుతుందని నిర్మాత నాగవంశీ ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసారు.
తమ సినిమాకి కేవలం సరదాగా నవ్వుకోవడానికి మాత్రమే రండి అని ఆడియన్స్ మైండ్ లోకి ఎక్కిం చేసాడు. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు మరోసారి నవ్వులు పూయించడానికి రెడీ అవుతున్నారు. వీళ్లతో పాటు దర్శకుడు కె.వి. అనుదీప్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అనుదీప్ ఎంట్రీ సినిమాకు అదనపు అస్సెట్. అతడి ముఖంలోనే నవ్వు రాసిపెట్టి ఉంటుంది.
ఇక నటిస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. మరి ఈ సినిమాకి పార్ట్ 3 కూడా ఉందా? అంటే ఉందనే అంటున్నారు కుర్రాళ్లంతా. కానీ మూడవ భాగం తీయడానికి మాత్రం సమయడం పడుతుందంటున్నారు. `మ్యాడ్` లో నటిస్తుండటంతో ఈ సినిమా తప్ప మరో సినిమా చేయరా? అని బయట అంతా అడుగు తున్నారు. అందుకే మూడవ భాగానికి గ్యాప్ ఇస్తున్నాం. ఈప్రాంచైజీని ఆపే ప్రశక్తే లేదన్నారు.
ఈ ప్రాంచైజీకి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా నాగవంశీ నిర్మిస్తున్నారు. తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ లాభాలు వచ్చే కంటెంట్ ఇది. కేవలం పాత్రలు...చిన్న చిన్న ఏర్పాట్లు తప్ప పెద్దగా బడ్జెట్ ఖర్చులేని ప్రాంచైజీ ఇది. మార్చి 28న చిత్రం రిలీజ్ అవుతుంది. వాస్తవానికి 29న రిలీజ్ చేయాల నుకున్నారు. కానీ అదే రోజు అమావాస్యకావడంతో ఒక్క రోజు ముందుకు తీసుకొచ్చారు.