గజిని లాంటి కథతో మదరాసి..?
పరాశక్తి సినిమా సుధ కొంగర డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఆ సినిమాలో శివ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నారు.;
కోలీవుడ్ లో వరుస సక్సెస్ ఫుల్ సినిమాలతో స్టార్ డం కొనసాగిస్తున్నాడు శివ కార్తికేయన్. అమరన్ తో లాస్ట్ ఇయర్ సూపర్ హిట్ అందుకున్న శివ కార్తికేయన్ ప్రస్తుతం పరాశక్తి, మదరాసి సినిమాలు చేస్తున్నారు. పరాశక్తి సినిమా సుధ కొంగర డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఆ సినిమాలో శివ కార్తికేయన్ స్టూడెంట్ లీడర్ గా నటిస్తున్నారు.
ఇక మురుగదాస్ డైరెక్షన్ లో హై యాక్షన్ ఎంటర్టైనర్ గా మదరాసి వస్తుంది. ఈ సినిమాలో కన్నడ భామ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. కొన్నాళ్లుగా అసలేమాత్రం ఫాం లో లేని డైరెక్టర్ మురుగదాస్ ఓ పక్క సల్మాన్ ఖాన్ తో సికందర్ సినిమా చేశాడు. ఆ సినిమా ఈ మంత్ ఎండింగ్ కి రిలీ అవుతుంది. ఇక ఆ సినిమాతో పాటు మదరాసి సినిమా కూడా భారీ అంచనాలతో వస్తుంది. మదరాసి టీజర్ తోనే సినిమాపై హ్యూస్ బజ్ క్రియేట్ చేశాడు మురుగదాస్.
ఐతే కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం మదరాసి సినిమా కథకు మురుగదాస్ సూపర్ హిట్ సినిమా గజినీకి దగ్గర పోలికలు ఉంటాయని అంటున్నారు. గజినీ కథకు మదరాసికి ఏంటి సంబంధం అంటే హీరో క్యారెక్టర్, యాక్షన్ అంశాలు ఇవన్నీ గజినీ సినిమా తరహా ఉంటాయట. ఐతే గజినీ లాంటి సినిమా అంటే మళ్లీ మురుగదాస్ మూస థోరణే అనుకునే వారే ఉన్నారు.
కానీ శివ కార్తికేయన్ మార్క్ చూపించేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఇక సినిమాలో సప్త సాగరాలు దాటి రుక్మిణి వసంత్ నటించడం కూడా సినిమాకు ప్లస్ అవుతుంది. ఇప్పటికే అమ్మడికి సౌత్ లో క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మదరాసితో తమిళ ఆడియన్స్ ని అలరించబోతుంది.
శివ కార్తికేయన్ ప్రతి సినిమా ఒక దానికి మించి మరోటి అన్నట్టుగా ఉంది. మురుగదాస్ తో చేస్తున్న ఈ సినిమా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. అమరన్ హిట్ తో స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించిన శివ కార్తికేయన్ ఈ మదరాసితో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి. మురుగదాస్ కూడా కొన్నాళ్లుగా చాలా వెనకబడి ఉన్నాడు. మదరాసితో తిరిగి ఫాం లోకి రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మురుగదాస్ కే కాదు శివ కార్తికేయన్ కు తెలుగులో సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే మదరాసికి తెలుగు రాష్ట్రాల నుంచి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయని టాక్.