టాప్ చెయిర్ కోసమైతే ఇలా కష్టమే..!
అందం అభినయం ఉన్నా కూడా లక్ కలిసి రాని కొందరు హీరోయిన్స్ కెరీర్ లో వెనకబడుతుంటారు.;
అందం అభినయం ఉన్నా కూడా లక్ కలిసి రాని కొందరు హీరోయిన్స్ కెరీర్ లో వెనకబడుతుంటారు. కానీ అవన్నీ ఉన్నా కూడా సినిమాల సెలక్షన్ లో లేట్ చేస్తే ఆమెను కచ్చితంగా మాళవిక మోహనన్ అనాల్సిందే. సౌత్ లో ఇప్పటికే తన లుక్స్ తో ఆకట్టుకుంటున్న ఈ మలయాళ ముద్దుగుమ్మ క్రేజీ సినిమాలు చేస్తున్నా కూడా పెద్దగా అవకాశాలు రాబట్టుకోవట్లేదు. ఐతే ఛాన్సులు వస్తున్నా అమ్మడు చేయట్లేదా లేదా నిజంగానే అవకాశాలు రావట్లేదా అన్నది తెలియదు కానీ మాళవిక తన రేంజ్ పెంచుకోలేకపోతుంది.
ప్రస్తుతం సౌత్ హీరోయిన్స్ కి మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ ఉన్న వారినే బాలీవుడ్ లో కూడా తీసుకుంటున్నారు. ఐతే ఈ టైం లో మాళవిక మోహనన్ ఎందుకో వెనక పడింది. అందంతో పాటు అభినయం కూడా మెప్పించేలా ఉన్నా మాళవిక తన రేంజ్ సినిమాలు మాత్రం చేయలేకపోతుంది. 2019 నుంచి ఈ ఆరేళ్లలో కేవలం ఆరు సినిమాలు మాత్రమే చేసింది మాళవిక.
ప్రస్తుతం అమ్మడు రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజా సాబ్ సినిమా చేస్తుంది. ఈ సినిమా కోసం రెండేళ్లుగా కష్టపడుతుంది అమ్మడు. ఐతే రాజా సాబ్ ఛాన్స్ అందుకున్న తర్వాత తెలుగులో మరికొన్ని ఛాన్స్ లు వచ్చాయని టాక్. ఐతే వాటిని ఎందుకో మాళవిక చేయనని అనేసిందట. ఐతే ప్రతి హీరోయిన్ తమ కెరీర్ లో టాప్ లోకి వెళ్లాలని అనుకుంటారు.
మాళవికకు ఆ ఆలోచనలు ఉన్నా.. అమ్మడి టాలెంట్ కి ఆ స్కోప్ ఉన్నా కూడా ఎందుకో బజ్ క్రియేట్ చేయలేకపోతుంది. రాజా సాబ్ తో పాటుగా మాళవిక కార్తితో సర్దార్ 2 సినిమాలో కూడా నటిస్తుంది మాళవిక. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న అమ్మడు తెలుగులో మాత్రం ఆఫ్టర్ రాజా సాబ్ అనే చెబుతుందట. పర్ఫెక్ట్ స్టార్ మెటీరియల్ అయిన మాళవిక ఇలా ఎందుకు చేస్తుంది అన్నది ఎవరికీ తెలియదు కానీ ఆమె ఫాలోవర్స్ మాత్రం మాళవిక స్టార్ క్రేజ్ వస్తే ఎంజాయ్ చేసేలా ఉన్నారు.
తమిళ్ లో పేట, మాస్టర్, మారన్, తంగళాన్ సినిమాలు చేసిన మాళవిక అక్కడ ఒక మోస్తారు క్రేజ్ తెచ్చుకోగా రాజా సాబ్ హిట్ పడితే మాత్రం అమ్మడికి మంచి క్రేజ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. సినిమాల గురించి పక్కన పెడితే మాళవిక చేసే ఫోటో షూట్స్ కి అయితే క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె సోషల్ మీడియా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు మాళవిక మోహనన్ ఫోటో షూట్స్ కోసమే ఎదురుచూస్తుంటారని చెప్పొచ్చు.