అట్లీ మ‌రీ అంత సెల్పిషా!

ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుంది. అనంత‌రం రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండానే మొద‌లు పెట్టాల‌ని అట్లీ ప్లాన్ చేస్తున్నాడు.;

Update: 2025-03-25 06:03 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అట్లీ భారీ చిత్రానికి స‌న్నాహాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు దుబాయ్ లో జ‌రుగుతున్నాయి. ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. ఈ ఒక్క సినిమా కోస‌మే బ‌న్నీ 170 కోట్ల‌కు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. అంటే ఈ సినిమా బ‌డ్జెట్ ఎన్ని వంద‌ల కోట్లు ఉంటుందో అంచ‌నా వేయోచ్చు. బ‌న్నీ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని స‌న్ పిక్చ‌ర్స్ భారీ బడ్జెట్ కేటాయించింది.

ఈ చిత్రం అతి త్వ‌ర‌లోనే ప్రారంభోత్స‌వం జ‌రుపుకోనుంది. అనంత‌రం రెగ్యుల‌ర్ షూటింగ్ కూడా పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండానే మొద‌లు పెట్టాల‌ని అట్లీ ప్లాన్ చేస్తున్నాడు. అయితే అట్లీ ఈ సినిమా కోసం ఏకంగా మూడు సినిమాలు..ముగ్గురు హీరోల్ని వెన‌క్కి పెట్టిన‌ట్లు తాజాగా వెలుగులోకి వ‌స్తోంది. మక్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయాల్సి ఉందట‌. గ‌త‌లో ఎప్పుడో క‌మిట్ అయిన ప్రాజెక్ట్ ఇది.

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో మొద‌లు పెట్టాల‌నుకున్నారట‌. కానీ అనూహ్యంగా అదీ ఆగిపోయింది. ఈ చిత్రాన్ని మురాద్ ఖేతాని నిర్మించ‌డానికి ఒప్పందం చేసకున్నారు. 'బేబిజాన్' నిర్మాత కూడా ఇత‌డే. ఇటీవ‌ల రిలీజ్ అయిన 'బేబిజాన్' ప్లాప్ కూడా ఈ సినిమా ఆగిపోవ‌డానికి ఓ కార‌ణంగా వినిపిస్తుంది. అలాగే షాహిద్ క‌పూర్ హీరోగా అట్లీ ఓ సినిమా చేయాల్సి ఉందట‌. 2024లోనే ఇద్ద‌రి మ‌ధ్య స్టోరీ డిస్క‌ష‌న్స్ పూర్త‌య్యాయ‌ట‌.

కానీ షాహిద్ అప్పుడు బిజీగా ఉండ‌టంతో డేట్లు స‌ర్దుబాటు కాలేదు. ఆ త‌ర్వాత షాహిద్ న‌టించిన 'దేవా' కూడా ప్లాప్ అయింది. దీంతో అట్లీ కూడా లైట్ తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అలాగే వీర్ ప‌హారియాతోనూ అట్లీ ఓ సినిమా చేయాల్సి ఉందట‌. అట్లీ భార్య ఈ చిత్రాన్ని నిర్మించాలి. కానీ అది మెటీరియ‌లైజ్ కాలేదు. అట్లీ -బ‌న్నీ ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయిన త‌ర్వాత వాళ్లందరి గురించి ఆలోచించ‌డం మానేసాడు. బ‌న్నీ డేట్లు ఇవ్వ‌క‌పోతే గ‌నుక వాళ్ల‌తో అప్ప‌టిక‌ప్పుడు ప‌ట్టా లెక్కించేవారు. కానీ బ‌న్నీ పాన్ ఇండియా స్టార్ కాబ‌ట్టి ముందుగా అత‌డితోనే ముందుకెళ్తున్నాడు.

Tags:    

Similar News