అనిల్ మెగా ప్రాజెక్టు లాంచ్ అప్పుడేనా?

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బ‌జ్ ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిపిస్తోంది.;

Update: 2025-03-25 06:58 GMT

టాలీవుడ్ లో అప‌జ‌య‌మెర‌గ‌ని డైరెక్ట‌ర్ గా రాజ‌మౌళి త‌ర్వాత అనిల్ రావిపూడి మంచి పేరు సంపాదించుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వ‌రుస విజ‌యాల‌తో దూసుకెళ్తున్నాడు అనిల్ రావిపూడి. రీసెంట్ గా సంక్రాంతికి వ‌స్తున్నాం సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు అనిల్ రావిపూడి.

ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి త‌న త‌ర్వాతి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఆల్రెడీ చిరూకి ఓ లైన్ చెప్పి గ్రీన్ సిగ్న‌ల్ తెచ్చుకుని సినిమాను అనౌన్స్ చేసిన అనిల్, వైజాగ్ వెళ్లి అక్క‌డ స్క్రిప్ట్ వ‌ర్క్ ను కూడా పూర్తి చేసుకున్నాడు. రీసెంట్ గా సింహాచ‌లం ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారిని ద‌ర్శించుకున్న టైమ్ లో అనిల్ ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడి సినిమాపై హైప్ ను పెంచాడు.

చిరంజీవిని ఆయ‌న అభిమానులు ఎలా అయితే చూడాల‌నుకుంటున్నారో తాను ఆయ‌న్ని అలానే చూపించబోతున్నాన‌ని, మెగాస్టార్ ఫ్యాన్స్ కు ఈ క‌థ చాలా బాగా న‌చ్చుతుంద‌ని అనిల్ తెలిపారు. ఈ సినిమా గ్యాంగ్ లీడ‌ర్, ఘ‌రానా మొగుడు, రౌడీ అల్లుడు త‌ర‌హా సినిమా అవుతుంద‌ని అనిల్ రావిపూడి ఫ్యాన్స్ కు అభ‌య‌మిచ్చాడు.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ బ‌జ్ ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు తెలుగు కొత్త సంవ‌త్స‌ర‌మైన ఉగాది రోజున ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ పాత్ర చాలా కొత్త‌గా ఉంటూనే ఆయ‌న‌దైన కామెడీ టైమింగ్ తో ఉంటుంద‌ని అంటున్నారు.

ఈ సినిమాలో ల‌వ్ ట్రాక్, డ్యూయెట్స్ లేకుండా సిట్యుయేష‌నల్ కామెడీతో పాటూ సాంగ్స్ కూడా క‌థ‌లో భాగంగా ఉండేలా అనిల్ ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న మెగాస్టార్, ఆ సినిమాను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్ పై సాహు గార‌పాటి నిర్మించ‌నుండ‌గా వ‌చ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఆల్రెడీ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తెలిపారు.

Tags:    

Similar News