జపాన్‌లో డే 2.. స్టైలిష్ అవతార్‌లో యంగ్ టైగర్
'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో ఎన్టీఆర్‌కి జపాన్‌లో ఫాలోయింగ్ పెరిగింది. ఎన్టీఆర్ అంటే పడి చచ్చేంత అభిమానంను అక్కడి వారు చూపిస్తున్నారు.;
'ఆర్‌ఆర్‌ఆర్' సినిమాతో ఎన్టీఆర్‌కి జపాన్‌లో ఫాలోయింగ్ పెరిగింది. ఎన్టీఆర్ అంటే పడి చచ్చేంత అభిమానంను అక్కడి వారు చూపిస్తున్నారు. ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో జపనీస్ అభిమానులు ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ఎన్టీఆర్‌పై తమకు ఉన్న అభిమానం చూపిస్తూ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్న విషయం తెల్సిందే. లేడీ ఫ్యాన్స్ ఎన్టీఆర్ కటౌట్ పెట్టుకుని మరీ వీడియోలు చేస్తున్నారు. అక్కడ ఎన్టీఆర్‌కి ఉన్న క్రేజ్ నేపథ్యంలో 'దేవర' సినిమాను అక్కడ విడుదల చేసేందుకు గాను నిర్మాతలు సిద్ధం అయ్యారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేసేందుకు గాను ప్లాన్ చేశారు. మార్చి 28న దేవర సినిమా జపాన్‌లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
'దేవర' సినిమా ప్రమోషన్స్ కోసం ప్రస్తుతం జపాన్‌లో ఉన్న ఎన్టీఆర్ అక్కడి ఫ్యాన్స్‌తో సందడి చేస్తున్నాడు. మొదటి రోజు ప్రమోషన్స్‌లో భాగంగా ప్రివ్యూ థియేటర్‌లో అభిమానులతో సందడి చేశాడు. థియేటర్‌లో దేవర ఆయుద పూజ సాంగ్‌కి డాన్స్ చేసిన విషయం తెల్సిందే. థియేటర్‌లో ఎన్టీఆర్ ఆయుద పూజ పాటకు డాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ దేవరకు అక్కడ ఉన్న క్రేజ్ చూస్తే మతి పోతుంది. అభిమానుల నుంచి వస్తున్న స్పందన చూసి ఎన్టీఆర్ రెట్టించిన ఉత్సాహంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. మొదటి రోజు అభిమానులతో, అక్కడి మీడియా వారితో టైమ్ స్పెండ్ చేసిన ఎన్టీఆర్ రెండో రోజూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.
ఎన్టీఆర్ రెండో రోజు ఇలా స్టైలిష్, కూల్ లుక్‌తో సర్‌ప్రైజ్ చేశాడు. ఎన్టీఆర్ ఈమధ్య కాలంలో బాగా బరువు తగ్గినట్లు అనిపిస్తుంది అని ఈ ఫోటోను చూస్తుంటే అర్ధం అవుతుంది. ఈమధ్య కాలంలో ఎన్టీఆర్ వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉన్నాడు. అయినా కొత్త సినిమా కోసం కొత్త లుక్ కోసం బరువు తగ్గినట్లు సమాచారం అందుతోంది. జపాన్‌లో అభిమానులను తన లుక్‌తో ఎన్టీఆర్ సర్‌ప్రైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా కూల్ అండ్ స్టైలిష్ ఔట్ ఫిట్‌తో ఎన్టీఆర్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పోటోలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ రెండో రోజు ప్రమోషన్స్‌లో ఈ ఔట్ ఫిట్‌లోనే పాల్గొంటున్నాడు. ఈ స్టైలిష్ అవతార్‌లో లేడీస్ మరింత మంది ఎన్టీఆర్‌ను అభిమానించే అవకాశాలు ఉన్నాయి.
ఆర్‌ఆర్‌ఆర్ సినిమా జపాన్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వంద రోజులకు పైగా ప్రదర్శింపబడ్డ ఆ సినిమా హాలీవుడ్ సినిమాల స్థాయిలో వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ వసూళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసే విధంగా దేవర సినిమాను విడుదల చేయబోతున్నారు. పెద్దగా పోటీ లేక పోవడంతో పాటు ఎక్కువ స్క్రీన్స్‌లో సినిమాను విడుదల చేయబోతున్న కారణంగా దేవర సినిమా కచ్చితంగా జపాన్‌లో అత్యధిక వసూళ్లు నమోదు చేసిన ఇండియన్ మూవీగా నిలిచే అవకాశాలు ఉన్నాయని ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటి వరకు జపాన్‌లో విడుదలైన తెలుగు సినిమాలతో పోల్చితే దేవర సినిమాకు అక్కడ ప్రివ్యూ టాక్‌తో పాటు, పాజిటివ్ బజ్ అధికంగా ఉందని అక్కడి మీడియా వారు అంటున్నారు. మరి ఫలితం ఎలా ఉంటుంది అనేది మార్చి 28న తేలే అవకాశాలు ఉన్నాయి.