సికందర్ ట్రైలర్.. సల్మాన్ స్టామినాను తేల్చే రిస్కీ కథ!

ఇప్పుడు అదే నేపథ్యంలో సికందర్ ట్రైలర్ రిలీజ్ కావడంతో మళ్లీ చర్చ మొదలైంది. ఈసారి సల్మాన్ ఖాన్ అసలైన పరీక్షకు సిద్ధమవుతున్నాడా అనే సందేహం బలపడుతోంది.;

Update: 2025-03-24 06:50 GMT

ఇటీవల కాలంలో బాలీవుడ్ టాప్ హీరోలంతా ఒకే విధంగా కమర్షియల్ ఫార్ములాతో సినిమాలు చేస్తూ తమ మార్కెట్‌ను ప్రమాదంలో పడేస్తున్నారు. అగ్రహీరో సల్మాన్ ఖాన్ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నాడు. రాధే, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ వంటి సినిమాలు రెగ్యులర్ కంటెంట్ తో రావడంతో పెద్దగా హిట్ టాక్ అందుకోలేదు. టైగర్ 3 బ్రాండ్ ఫ్రాంచైజ్ వల్ల ఓపెనింగ్స్ బాగానే అందుకున్నా బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు నిలవలేకపోయింది.

దీంతో సల్మాన్ బ్రాండ్ విలువ తగ్గిందన్న కామెంట్లు మొదలయ్యాయి. ఇప్పుడు అదే నేపథ్యంలో సికందర్ ట్రైలర్ రిలీజ్ కావడంతో మళ్లీ చర్చ మొదలైంది. ఈసారి సల్మాన్ ఖాన్ అసలైన పరీక్షకు సిద్ధమవుతున్నాడా అనే సందేహం బలపడుతోంది. ట్రైలర్‌నే చూస్తే ఇది ఓ మాస్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాతో వస్తున్నట్లు అర్ధమవుతుంది.

సౌత్‌ సినిమాల వాసన స్పష్టంగా కనిపిస్తుంది. సామాజిక భావాలతో నడిచే హీరో, ప్రేమలో పడే కథానాయిక, కుటుంబ విలువలు, విలన్‌కి ఇచ్చే స్ట్రాంగ్ కౌంటర్.. ఇవన్నీ మొన్నటి వరకు చూసిన ప్యాకేజింగ్ లాగానే కనిపిస్తోంది. దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తన బ్రాండ్‌కు గాను యాక్షన్, ఎమోషన్ మిక్స్ చేశాడు. కానీ గతంలో ఆయన చేసిన తుపాకీ, ఘజిని సినిమాల్లో ఉన్న కొత్తదనం మాత్రం ఈ ట్రైలర్‌లో కనిపించలేదు.

ఒక విధంగా చెప్పాలంటే, ఇది ఠాగూర్, సర్కార్ కాంబినేషన్‌లోని స్టోరీ షేడ్స్‌కి రీమిక్స్‌లా అనిపిస్తోందనే కామెంట్స్ వస్తున్నాయి. రష్మిక మందన్న, కాజల్ అగర్వాల్ హీరో పరిచయాల్లో కొంత ఫ్రెష్‌నెస్ ఇవ్వడానికి ప్రయత్నించినా, అవి కూడా బాగా లవ్వర్ బాయ్ లాంటి షాడోన్లోకి వెళ్తున్నట్లు అనిపిస్తోంది. సత్యరాజ్ విలన్ గా బాగానే కనిపిస్తున్నా, బలమైన అండ్ న్యూ ఏజ్ విలన్‌గా గుర్తింపు పొందాలంటే అది కథపైనే ఆధారపడి ఉంటుంది.

అయితే ట్రైలర్‌లో చూపించిన యాక్షన్ బ్లాక్స్, డైలాగ్ డెలివరీలే కాకుండా సల్మాన్‌కు కథ మీద ఉన్న నమ్మకాన్ని చూపించేలా ఉండాలి. కానీ అది ట్రైలర్ ద్వారా పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయింది. ఇంతవరకు వచ్చిన రెస్పాన్స్ ప్రకారం ట్రైలర్‌కి రియాక్షన్స్ మిక్స్‌డ్‌గానే ఉన్నాయ్. ఫ్యాన్స్ మాత్రం ప్యూర్ మాస్ ఫుల్‌ఫిల్మ్‌గా ఫీల్ అవుతుంటే, జనరల్ ఆడియన్స్ మాత్రం "ఇది మళ్లీ అదే ఫార్ములా" అనే టాక్ లో కనిపిస్తున్నారు.

ఈ సందర్భంలో సల్మాన్ ఖాన్ కోసం ప్రేక్షకులు మరింత కంటెంట్ బేస్డ్ కమర్షియల్ సినిమాలు కోరుకుంటున్నారు. ఇక ట్రైలర్ ఆధారంగా చూస్తే సికందర్ సినిమా అతని స్టార్ డమ్‌ను పరీక్షించే రిస్కీ ప్రయోగం అనే చెప్పాలి. మొత్తానికి, సల్మాన్ స్టామినాను మళ్లీ రీసెట్ చేసే ప్రయత్నంగా ఈ సినిమా నిలవాలి. ఈద్ సీజన్‌ని క్యాష్ చేసుకునే అనుకూలత ఉంది. కానీ కంటెంట్ మెప్పించకపోతే, గత సినిమాల తరహాలోనే హైప్ తగ్గిపోతుంది.

Full View
Tags:    

Similar News