మెగాస్టార్ తో సినిమా షాక్ ఇచ్చిన వెంకీ కుడుముల‌!

ఈ నెల 28న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగానే మెగా ప్రాజెక్ట్ గురించిన విష‌యాలు పంచుకున్నారు.;

Update: 2025-03-25 07:18 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వెంకీ కుడుముల ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రానికి స‌న్నాహాలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. చిరంజీవికి వెంకీ స్టోరి వినిపించ‌డం న‌చ్చ‌డంతో ఆయ‌న ఒకే చేయ‌డం జ‌రిగింది. దీంతో మెగాస్టార్ త‌దుప‌రి చిత్రం 157 లేదా 158వ చిత్రం వెంకీదే అవుతుంద‌ని వెలుగులోకి వ‌చ్చింది. అప్ప‌టికి రేసులో అనీల్ రావిపూడి లేడు. శ్రీకాంత్ ఓదెల కూడా లేడు. అయితే వాళ్లిద్ద‌రు ఎంట‌ర్ అయిన త‌ర్వాత వెంకీ ప్రాజెక్ట్ గురించి మ‌ళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు.

157వ చిత్రంగా అనీల్ చిత్రం ప‌ట్టాలెక్కు తుంద‌ని...158 గా శ్రీకాంత్ ప్రాజెక్ట్ ఫైన‌ల్ అయింది. మ‌రి వెంకీ ప‌రిస్థితి ఏంటి? అంటే ఆయ‌న నెంబ‌ర్ 159 అంటే? అస‌లు నెంబ‌రే లేదు అన్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెంకీ కుడుముల‌ రివీల్ చేసారు. ప్ర‌స్తుతం వెంకీ కుడుమ‌ల నితిన్ హీరోగా 'రాబిన్ హుడ్' చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నెల 28న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగానే మెగా ప్రాజెక్ట్ గురించిన విష‌యాలు పంచుకున్నారు. 'భీష్మ త‌ర్వాత చిరంజీవితో తీయాల‌ని ఓ క‌థ రాసాను. క‌థా ఆలోచ‌న గురించి ఆయ‌న‌కి చెప్పినప్పుడు బాగా న‌చ్చింది. చిరంజీవి అభిమానిని నేను. దీంతో ఆయ‌న‌తో సినిమా అంటే అద్భుతంగా ఉండాల‌ని చాలా అంశాల్ని జోడించి చాలా స‌మ‌యం తీసుకుని స్క్రిప్ట్ సిద్దం చేసాను.

కానీ ఆ క‌థ‌లో ఆయ‌న‌కి ఎక్క‌డో అసంతృప్తి క‌లిగింది. దాంతో మ‌రో క‌థ రాసుకుని వ‌స్తాన‌ని చెప్పాను. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఆయ‌న్ని క‌ల‌వ‌లేదు' అన్నారు. అలా ఆ ప్రాజెక్ట్ ర‌ద్ద‌యిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా ఈ సినిమా ఉంద‌ని మెగా అభిమానులు అనుకుంటున్నారు. మ‌రి మ‌ళ్లీ మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఎప్పుడు తీసుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News