మ్యాడ్ బోయ్స్ మైండ్ బ్లోయింగ్ కాంప్లిమెంట్స్!
నార్నే నితిన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది అన్న సంగతి తెలిసిందే. తొలి సినిమా `మ్యాడ్` తో మంచి విజయం అందుకున్నాడు.;
నార్నే నితిన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది అన్న సంగతి తెలిసిందే. తొలి సినిమా `మ్యాడ్` తో మంచి విజయం అందుకున్నాడు. నలుగురులో తాను సమాన పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలందుకు న్నాడు. ఇప్పుడదే సినిమాకు సీక్వెల్ గా `మ్యాడ్ స్క్వేర్` కూడా చేసిన సంగతి తెలిసిందే. మార్చి 28న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా నార్నే నితిన్ ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.
`నా తొలి సినిమా నుంచి మా బావ ఎన్టీఆర్ సలహాలు ఇస్తుంటారు. ఆయన చెప్పిన ప్రతీ మాటను మనసులో ఉంచుకుని మలుచుకుంటాను. భవిష్యత్ లో నూ ఆయన సలహాలు తీసుకుంటాను. తొలి సినిమాతో హిట్ కొట్టడంపై ఆయన చాలా సంతోషించారు. మొదటి సినిమాతో హిట్ కష్టం రా? అన్నారు. కానీ నువ్వు హిట్ కొట్టావ్. కెరీర్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందుకెళ్లు అన్నారు. ఆయన కాంప్లిమెంట్ ఎప్పటికీ మర్చిపోలేను అన్నారు.
సినిమాలో మరో కీలక పాత్ర పోషించిన సంగీత్ శోభన్ ఏమన్నాడంటే? `మ్యాడ్` రిలీజ్ తర్వాత నాప్రెండ్ వాళ్ల అన్నయ్య సంగీత్ ఈవెంట్ కి వెళ్లాను. అక్కడకు రామ్ చరణ్ కూడా వచ్చారు. ఆయన నన్ను గుర్తు పెట్టి ముగ్గురు బాగా చేసారన్నారు. ఆయన్ని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అనుకోకుండా జరిగింది. నన్ను చూడగానే ఆయన గుర్తు పట్టారు. నేను షాక్ అయ్యాను మ్యాడ్ లో నటించింది నేను అని ఎవరూ చెప్పకుండానే గుర్తు పట్టారు. అదే నాకు గొప్ప కాంప్లిమెంట్. సాధారణంగా అంత పెద్ద వ్యక్తులు పేర్లు మర్చిపోతుంటారు. అలాంటింది రామ్ చరణ్ నన్ను గుర్తు పట్టడం చాలా సర్ ప్రైజింగ్ గా అనిపించింది.
రామ్ నితిన్ ఏమన్నాడంటే? `ఇంట్లో నాన్న నా విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఏదైనా బాగోలేదు అంటే ముఖం మీదనే తిడతారు. నా మీద జోకులేసి గ్రౌండెడ్ గా ఉంచింది మా నాన్నే. ఆయన `మ్యాడ్` చూసిన తర్వాత పర్వా లేదురా. బాగానే ఇంప్రూవ్ అయ్యావ్. వెబ్ సిరీస్ లు సరిగ్గా చేయలేదు కానీ సినిమా బాగా చేసావ్ అన్నారు. స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. కాన్పిడెంట్ గా ఉన్నావ్. ఇంకా మంచి పోజిషన్ కి వెళ్తావ్ అన్నారు. నాకు చాలా సంతోసంగా అనిపించింది` అన్నారు.