మ‌రో రియ‌ల్ ఇన్సిడెంట్స్ తో న‌యా స్టార్!

కోలీవుడ్ హీరోల్లో రియ‌ల్ ఇన్సిండెంట్స్ తో సినిమాలు చేయ‌డంలో కార్తీ ముందుంటాడు.;

Update: 2025-03-24 06:51 GMT

కోలీవుడ్ హీరోల్లో రియ‌ల్ ఇన్సిండెంట్స్ తో సినిమాలు చేయ‌డంలో కార్తీ ముందుంటాడు. ఇప్ప‌టికే `యుగానికి ఒక్క‌డు`, ` కాఖీ`, `స‌ర్దార్` లాంటి వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా తెర‌కెక్కిన చిత్రాల్లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్లో ఆ సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రో వాస్త‌వ ఘ‌ట‌న‌తో రావ‌డానికి రెడీ అవుతున్నాడు.


ఒక‌ప్పుడు రామేశ్వ‌రం-శ్రీలంక ప్రాంతాల మ‌ధ్య స‌ముద్ర‌పు దొంగ‌ల హ‌వా న‌డిచేది. ఆ మార్గం కూడా ప్ర‌యాణం చేయాలంటే ప్ర‌యాణికులు భ‌య‌ప‌డేవారు. ఇప్పుడా సంఘ‌ట‌న ఆధారంగా కార్తీ హీరోగా త‌మిళ అనే కొత్త కుర్రాడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఇది పూర్తిగా సీ బ్యాక్ డ్రాప్ లో సాగే చిత్ర‌మ‌ని స‌మా చారం. ఇది కార్తీకి 29వ చిత్రం. దీన్ని డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుంది.

`ఖైదీ -2` తో పాటే ఈ చిత్రాన్ని కూడా ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో వడివేలును ఓ కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసారుట‌. అలాగే హీరోయిన్గా క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శిని తీసుకుంటున్నారుట‌. హీరోయిన్ గా క‌ల్యాణికి ఇప్పుడు పెద్ద‌గా అవకాశాలు రావ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇది గొప్ప అవ‌కాశ‌మే అవుతుంది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మే లేదా జూన్ లో చిత్రాన్ని ప్రారంభించాల‌ని చూస్తున్నారు.

మ‌రోవైపు కార్తీ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో `ఖైదీ -2 `కూడా త్వ‌ర‌లోనే మొద‌ల‌వుతుంది. ఇటీవ‌లే `కూలీ` షూటింగ్ ముగించిన లోకేష్ ఎంత మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ` ఖైదీ -2` కూడా ప‌ట్టాలెక్కించాల‌ని ప్లాన్ చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. రెండు సినిమాల‌కు డేట్లు స‌ర్దుబాటు చేసి పూర్తి చేయాల‌న్న‌ది కార్తీ ప్లాన్. అలాగే ఈ రెండు సినిమాలు కూడా వ‌చ్చే ఏడాది రిలీజ్ కానున్నాయి.

Tags:    

Similar News