దేవ‌ర‌కొండ‌తో భాగ్య శ్రీ రొమాన్స్ లంక‌లోనా!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, భాగ్య శ్రీ భోర్సే జంట‌గా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో `కింగ్ డ‌మ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందో.;

Update: 2025-03-24 07:20 GMT

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, భాగ్య శ్రీ భోర్సే జంట‌గా గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో `కింగ్ డ‌మ్` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందో. ఇదొక స్పై థ్రిల్ల‌ర్. ఇంత వ‌ర‌కూ దేవ‌రకొండ ఇలాంటి జాన‌ర్ ట్రై చేయ‌లేదు. గౌత‌మ్ సినిమాలు కూడా రొటీన్ కి భిన్నంగా ఉంటాయి. దీంతో ఈ సినిమాలో ఏదో కొత్త విష‌యం చెప్ప‌బో తున్నాడని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాల‌తో అంచ‌నాలు పీక్స్ కి చేరాయి.

ఒక్క టీజ‌ర్ తోనే భారీ హైప్ క్రియేట్ అయింది. అంత వ‌ర‌కూ సైలెంట్ గా షూటింగ్ చేసిన గౌత‌మ్ టీజ‌ర్ తో ఓ సంచ‌ల‌నంలా మారిపోయాడు. దీంతో ట్రైల‌ర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఆస‌క్తి గా ఎదురు చూస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ దాదాపు ముగింపు ద‌శ‌కు చేరుకుంది. చివ‌రి షెడ్యూల్ శ్రీలంక‌లో ప్లాన్ చేసారు. దీనిలో భాగంగా టీమ్ అంతా ఇప్ప‌టికే లంక‌కు చేరుకుంది. స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు కూడా నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ఓ హోట‌ల్ లో అంతా బ‌స ఏర్పాటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది. నేటి నుంచే షూటింగ్ మొద‌లు పెడుతున్నారు. వారం రోజుల పాటు ఈ షెడ్యూల్ ఉంటుంది. ఇందులోనే విజ‌య్- భాగ్య శ్రీమ‌ధ్య ఓ ప్రేమ‌గీతాన్ని కూడా చిత్రీక‌రిస్తారుట‌. సినిమాలో ఈపాట‌తో పాటు మ‌రో థీమ్ సాంగ్ కూడా ఉంటుంద‌ని స‌మాచారం. ఈ షెడ్యూల్ తో మొత్తం చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. మ‌రి ఈ పాట‌లో హీరో-హీరోయిన్ మ‌ధ్య రొమాన్స్ ఏ రేంజ్ లో హైలైట్ చేస్తాడో చూడాలి.

రొమాంటిక్ గీతాలు చిత్రీక‌రించ‌డంలో గౌత‌మ్ కి మంచి పేరుంది. అత‌డి చిత్రాల్లో పాట‌లేవి అన‌వ‌స‌రంగా ఇరికించిన‌ట్లు ఉండ‌వు. క‌థ‌లో భాగంగానే ట్రావెల్ అవుతుంటాయి. పాట వ‌చ్చిన‌ట్లే తెలియ‌దు. అదే పాట‌లో అంతే అంద‌మైన రొమాన్స్ పండిచంగ‌ల నేర్ప‌రి. మ‌రి `కింగ్ డ‌మ్` లో ఎలాంటి రొమాంటిక్ సాంగ్ డిజైన్ చేసాడో చూడాలి.

Tags:    

Similar News