సౌత్ మాస్ నార్త్ కి రుచి చూపించేలా!
ఈ ఫార్ములా తెలుగు, తమిళ భాషల్లో చాలా కాలం పాటు వర్కౌట్ అయింది. వందల కోట్ల వసూళ్లు సైతం తెచ్చాయి.;
సౌత్ లో మాస్ యాక్షన్ చిత్రాలు ఎలా ఉంటాయి? అన్నది మనవాళ్లకు బాగా ఐడియా ఉంటుంది. అందు లోనూ తమిళ, తెలుగు కంటెంట్ ఒకప్పుడు ఎంత ఊర మాస్ గా ఉండేదో చెప్పాల్సిన పనిలేదు. అవే అప్పట్లో రెండు భాషల్లోనూ భారీ వసూళ్లు తెచ్చే చిత్రాలు. ఎంత పెద్ద హీరో అయినా అలాంటి చిత్రాల్లోనే నటించాలని కోరుకునేవారు. కుటుంబం కోసం లేదా? ప్రియురాలి కోసం... లేదా స్నేహితుడి కోసం పోరాడి గెలవడం అన్నది సౌత్ హీరోల నైజం.
ఈ ఫార్ములా తెలుగు, తమిళ భాషల్లో చాలా కాలం పాటు వర్కౌట్ అయింది. వందల కోట్ల వసూళ్లు సైతం తెచ్చాయి. ఆ లాజిక్ తో చాలా మంది దర్శకులు అదే తరహా కథలవైపే ఆసక్తి చూపించేవారు. హీరోలు కూడా అలంటి సినిమాలు చేసి సక్సెస్ ఉన్న దర్శకులతో పనిచేయడానికి ముందుకొచ్చేవారు. ఇప్పుడీ పార్ములా టాలీవుడ్ ..కోలీవుడ్ కి పాతదైపోయింది. ఇప్పుడిప్పుడే ఇన్నోవేటివ్ గా సినిమాలు తీయడం మొదలు పెడుతున్నారు.
అయితే ఇదే మాస్ ని బాలీవుడ్ పరిచయం చేసే పనిలో కొంత మంది దర్శకులున్నారు. ఇప్పటికే జాట్ చిత్రాన్ని గోపీచంద్ మలినేని సన్ని డియోల్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి మాస్ అక్కడ ఆడియన్స్ కి కొత్త. అందుకే తనలో మాస్ యాంగిల్ ని నార్త్ కి పరిచయం చేస్తున్నాడు. మరి మురగదాస్ కూడా 'సికిందర్' తో అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడా? అంటే సన్నివేశం అలాగే కనిపిస్తుంది.
సల్మాన్ ఖాన్ తో మురగదాస్ `సికిందర్` చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈద్ సందర్భంగా సినిమా రిలీజ్ అవుతుంది. గతంలో రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో ఇదో రొటీన్ సినిమా అనే విమర్శ వ్యక్తమైంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే మురగదాస్ తమిళ మట్టి వాసన హిందీ ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేసినట్లే ఉందన్న విషయం అర్దమవుతుంది.