పిక్‌టాక్‌ : అంజలి సూపర్‌ స్టైలిష్ గ్లామర్‌ లుక్‌

సాధారణంగా అంజలి ఏ ఫోటోలు షేర్‌ చేసినా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి.;

Update: 2025-03-23 09:02 GMT

తెలుగు అమ్మాయి అయిన అంజలి తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా దూసుకు పోతుంది. తెలుగులోనూ ఈమె పలు సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో స్టార్‌డం దక్కలేదు. తెలుగు సినిమాలతో పోల్చితే తమిళ్‌ సినిమాలతో అంజలికి ఎక్కువ గుర్తింపు లభించింది. ప్రస్తుతం తమిళ్‌లో పలు పెద్ద సినిమాల్లో నటిస్తున్న అంజలి సోషల్‌ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా అంజలి ఏ ఫోటోలు షేర్‌ చేసినా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ ఉంటాయి. అలాంటిది స్టైలిష్‌ లుక్‌తో పాటు గ్లామర్‌ పిక్స్ షేర్‌ చేస్తే వైరల్‌ కాకుండా ఎలా ఉంటాయి.


సింపుల్‌ ఔట్‌ ఫిట్‌లోనూ స్టైలిష్ లుక్‌తో మెరిపించే విధంగా అంజలి సర్‌ప్రైజ్ చేసింది. ఆకట్టుకునే బ్యూటీఫుల్‌ మేకోవర్‌తో పాటు, డీసెంట్‌ హెయిర్ స్టైల్‌తో, డిఫరెంట్ డిజైనర్‌ ఔట్‌ ఫిట్‌ను ధరించిన అంజలి షేర్ చేసిన ఈ ఫోటోల్లో డిఫరెంట్‌గా ఫోటోలకు ఫోజ్‌లు ఇచ్చింది. నడుము అందం చూపించడంతో చూపు తిప్పుకోనివ్వడం లేదు. కొందరు హీరోయిన్స్‌ స్కిన్‌ షో చేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది. కొందరు స్కిన్‌ షో చేస్తేనే వారి ఫోటోలను చూడగలం. కానీ అంజలి స్కిన్‌ షో చేయకుండానే తన అందంను చూపించి చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఒకప్పుడు కాస్త బొద్దుగా అనిపించే అంజలి ఇప్పుడు సన్నగా నాజూకుగా తయారు అయింది. సినిమాల్లో కంటే ఇలా ఫోటో షూట్స్‌లో మరింత అందంగా కనిపిస్తుంది.


అంజలి 1986 జూన్‌ 16న ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా రాజోలులోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించింది. అంజలికి ఒక సోదరితో పాటు ఇద్దరు సోదరులు ఉన్నారు. స్కూలింగ్‌ను రాజోలులో పూర్తి చేసిన అంజలి చెన్నైకి వెళ్లి మ్యాథ్స్‌లో డిగ్రీని పూర్తి చేసింది. కుటుంబ సభ్యుల మద్దతుతో అంజలి సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు సినిమాల్లో మొదట నటించిన పెద్దగా గుర్తింపు రాకపోవడంతో తమిళ సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేసింది. మోడలింగ్‌లోనూ రాణించిన అంజలి 2006 సంవత్సరంలో పోటో అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2007లో తమిజ్‌ అనే సినిమాలో నటించడం ద్వారా తమిళ నాట గుర్తింపు దక్కించుకుంది.

రెండు సార్లు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును సొంతం చేసుకున్న అంజలి తెలుగులో షాపింగ్‌ మాల్‌, జర్నీ వంటి డబ్బింగ్‌ సినిమాలతో గుర్తింపు దక్కించుకుంది. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లో నటించడంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో స్టార్‌డం దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించింది.ఈ ఏడాది శంకర్ దర్శకత్వంలో వచ్చిన రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌ సినిమాలోనూ అంజలి సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. తెలుగులో ఈమె నటించిన గీతాంజలి అనే హర్రర్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో మరిన్ని లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను అంజలి చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News